పాల్గుణ మాసం విశిష్టత
ఫాల్గుణ మాసం సర్వదేవతా వ్రత సమాహారం. చైత్రాది మాసాల క్రమంలో చివరిది ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం. ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గునికి బుద్ధి వికాసాన్ని ధైర్య స్థిర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం.
ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథి విశేషమే! శిశిర ఋతువుకు ముగింపు. ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది.
ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం చేస్తారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశిగా వ్యవహరిస్తారు. చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు.
విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు క్షీరాన్నం, లేదా పాలు నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఈ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ఆమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం.
పౌర్ణమిని ఉలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి ఊపుతారు. డోలికా పూర్ణిమ అంటారు. రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. ఫాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు.

No comments:
Post a Comment