My site provides Vastu and Jathakam ....

Thursday, 19 December 2019

అమెరికాలో లగ్నసమయం గుర్తించే విధానము

ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా లగ్నం రాశిని ఎలా గుర్తించాలి? సాధారణంగా ఇది అందరికీ కలిగే సందేహమే. అమెరికాలో నేటి ఉదయం ఏలగ్నం. అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఆలోచన మొదలవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తిముగా సూర్యుడే ప్రామాణికం అని గ్రహించాలి.
పన్నెండు రాశులు 12 లగ్నములు. అవి 1 ) మేషము 2 ) వృషభము 3 ) మిధునము 4 ) కర్కాటకం 5 ) సింహం 6 ) కన్య 7 ) తుల 8 ) వృశ్చికం 9 ) ధనస్సు 10 ) మకరం 11 ) కుంభం 12 ) మీనం
రోజుకు 24 గంటలు. అంటే 12 లగ్నములు ప్రతిరోజూ ఉంటాయి. ప్రతిలగ్నం సమయం రెండుగంటలు
 పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి.
ఉదాహరణ: ఒక రోజు  ఉదయం 06-05 నుండి 08-04 ని.ల వరకు  మకరలగ్నం ఉంది.
తరువాత ఏలగ్నం?
ఇంకేమిటి ఉంటుంది?
మకరం తరువాత కుంభమే  కదా! :- ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.
ఏ లగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు?
మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు? సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.

No comments:

Post a Comment