గ్రహగమనాలు మానవుల జీవితంపై ప్రభావాలు చూపుతున్నాయన్నది వాస్తవం. కొన్ని మార్లు ప్రయోజనాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. గ్రహమాలిక గురించిన విషయాలు చాలావరకు పరిగణనన తీసుకున్న సందర్భాలు తక్కువ. జన్మకాల దశలో మాత్రమే ఈ ప్రభావం ఎక్కువ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. జన్మకాల దశ అనంతరం ఈ ఫలాలు వారివారి నక్షత్రాలు స్థానాలను అనుసరించి ఉంటాయి. గ్రహమాలిక గురించి తన రచనలలో వరాహమిహురుడు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ bందుకు అని అనిపించవచ్చు. ఈ నెల పూర్ణిమ తరువాత పాడ్యమి నాటి నుండి కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కుంభం, మీనం, మేషములలో రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల గ్రహమాలికా స్థితి కనిపిస్తుంది. ఇదే వరుసలో మిధునం కర్కాటకంలలో వరుణ, గురు గ్రహాలు కూడా ఉన్నాయి. ఆధునికులు వరుణ ఇంద్ర యమ గ్రహ ప్రస్తావన కూడా అప్పుడప్పుడు తమ గణన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వరుణ (యురెనస్) మిధునంలో, గురువు కర్కాటకంలో సంచారం చేస్తున్నాయి. ఈ గ్రహమాలికలో కుంభంనుంచి కర్కాటకం వరకు రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల, వరుణ, గురు గ్రహమాలికగా కనిపిస్తున్నాయి. ఆరు లేదా ఎనిమిది గ్రహాల ఈ మాలిక వల్ల కొన్ని రాశులవారికి అద్భుత యోగాలు, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహగమనాలను మాలికా స్థితిని విశ్లేషించే సిద్ధాంతులు ఈ విషయాలను మరింత స్పష్టంగా చెప్పగలరు.
ప్రస్తుతం శుభ వీక్షణ, ముఖ్యంగా గురు గ్రహ చూపు గ్రహమాలికపై కనిపించడం విశేషించి ఫలితాలను విశ్లేషించవచ్చు.
గ్రహమాలిక జాతకంలో ఒక ముఖ్యమైన యోగం. ఇది ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగలదు. ఇది ఎలా పనిచేస్తుందో మీ జాతకంలోని ఇతర గ్రహస్థితులపై ఆధారపడి ఉంటుంది.
గ్రహమాలిక అంటే ఏమిటి?
జాతక చక్రంలో గ్రహాలు వరుసగా (క్రమంగా) కొన్ని రాశుల్లో ఉండి ఒక “మాల” లాగా ఏర్పడితే దాన్ని గ్రహమాలిక అంటారు. ఉదాహరణకు 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు వరుసగా రాశుల్లో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది.
గ్రహమాలిక వల్ల లాభాలు
గ్రహమాలిక యోగం బలంగా ఉంటే.. జీవితం లో స్థిరత్వం వస్తుంది. సంపాదన మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ, పబ్లిక్ రంగంలో పేరు, ప్రతిష్ట రావచ్చు. నిర్ణయ శక్తి బలంగా ఉంటుంది. ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక్కడ మరో విషయం గమనించాలి. ఎప్పుడు ఫలితం తగ్గుతుంది? అన్న విషయాలను పరిగణన చేయాలి. వాస్తవంగా పరిశీలిస్తే ... ఇలా ఉంటే ఫలితాలు తగ్గవచ్చు. పాపగ్రహాలు (శని, రాహు, కేతు, కుజుడు) ఎక్కువగా ఉంటే అవి నీచస్థితిలో ఉంf,ñ ముఖ్య గ్రహాలు బలహీనంగా ఉంటే, ప్రస్తుతం వివిధ వ్యక్తుల జాతక చక్రాలలన పరిశీలించి వారి దశ-భుక్తి బలంగా లేకపోతే ఇబ్బందులు ఉంటాయి.
కుంభ మీన మేష రాశుల్లో రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల గ్రహమాలిక స్థితి ఒక ముఖ్యమైన గోచార యోగం. ఇది సాధారణంగా అందరికీ ఒకేలా ఫలితం ఇవ్వదు. పైన ఉదహరించినట్లు రాశి, లగ్నం, దశలపై ఆధారపడి మారుతుంది.
ఎవరికి లాభం?
అయితే సామాన్యంగా ఎవరికి లాభం ఎక్కువగా ఉంటుందో ఇలా చూడొచ్చు
ఎక్కువగా లాభం పొందే రాశులు
1. మేష రాశి ఈ గ్రహమాలిక మీ రాశికి దగ్గరగా ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఎదుగుదల, ధైర్యం, చక్కని నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది
2. కుంభ రాశి: గ్రహాలు ఈ రాశి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఆర్థిక లాభాలు, నెట్‌వర్క్, ఫ్రెండ్స్ ద్వారా అవకాశాలు,దీర్ఘకాల ప్లాన్లు సక్సెస్ అవుతాయి.
మీన రాశి మధ్యలో ఉన్నందున మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఎదుగుదల, విదేశీ అవకాశాలు, కొత్త ప్రయోజనకరమైన ఆలోచనలు రావచ్చు. మార్గాలు సుగమం అవుతాయి.
మిశ్రమ ఫలితాలు ఇచ్చే రాశులు
వృషభ, మిథున, తుల, ధనుస్సు రాశుల వారికి కొన్ని విషయాల్లో లాభం, కొన్ని చోట్ల ఆలస్యం, కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది.
జాగ్రత్త అవసరం ఉన్న రాశులు
కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర రాశులవారికి ఒత్తిడి, ఖర్చులు పెరగడం, ఆరోగ్యం, సంబంధాల్లో జాగ్రత్త. త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
No comments:
Post a Comment