My site provides Vastu and Jathakam ....

Wednesday, 15 August 2018

శ్రావణ మాసం

శ్రావణ మాసం
సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం “శ్రావణ మాసం”

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి – బ్రహ్మదేవుడు
 విదియ – శ్రీయఃపతి
 తదియ – పార్వతీదేవి
 చవితి – వినాయకుడు
 పంచమి – శశి
 షష్టి – నాగదేవతలు
 సప్తమి – సూర్యుడు
 అష్టమి – దుర్గాదేవి
 నవమి – మాతృదేవతలు
 దశమి – ధర్మరాజు
 ఏకాదశి – మహర్షులు
 ద్వాదశి – శ్రీమహావిష్ణువు
 త్రయోదశి – అనంగుడు
 చతుర్దశి – పరమశివుడు
 పూర్ణిమ – పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం
 శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం
 మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి
 మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి
 ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ
 సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ – హయగ్రీవ జయంతి
 వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి
 క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి – కామిక ఏకాదశి
 ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య
 ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

Tuesday, 23 January 2018

రథ సప్తమినాడు ఏంచేయాలి


రథ సప్తమినాడు గుమ్మం ముందు 'రథం ముగ్గును' వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దాని పైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. సూర్యుడి చిత్రపటానికి అలంకరణ చేసి పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి, సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. సూర్య నమస్కారాలు చేయాలి .  రథ సప్తమినాడు స్నాన దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబు లో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం చేయాలి. అయితే ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం చేయడం ఉత్తమం 
 సూర్య గాయత్రి
ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్ ||
108 మార్లు పారాయణం చేయాలి.
 
అదిత్య హ్రుదయం పారాయణం చేయాలి 

Friday, 19 January 2018


 మాఘ మాస విశిష్టత


మాఘ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియ, తదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూశిష్టత జ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు.

ఈ చవితికే తిలచతుర్ధి అని పేరుంది. ఈ రోజు ప్రత్యేకంగా నువ్వులను దానం ఇవ్వటం వల్ల అధిక పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

మాఘ శుక్ల పక్ష పంచమి నుండి వసంత ఋతువు ఆరంభమవుంటుందనే  వసంతోత్సవము జరుపుతారు. అయితే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలాన్నిశిశిర ఋతువుగా పరిగణిస్తారు వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. కానీ  శిశిర ఋతువు ప్రారంభమైన ఐదవ రోజు మాఘ పంచమి నుంచి పరోక్షంగా వసంత ఋతువు ప్రారంభం ఐనట్టు పండుగలు జరుపుకుంటాము. ఈ నేపథ్యంలోనే సృష్టియొక్క యౌవనం వసంత ఋతువు.మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి (శ్రీ పంచమి)
పర్వదినం వస్తుందనే వాదనవుంది .ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు.
వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు తెలుపుతారు.
సరస్వతిని పూజించిన వారికీ విద్య అబ్బుతుందని విశ్వసిస్తారు.  ఈ రోజు ఆంజనేయుని పూజిస్తే విద్య వస్తుందని నమ్ముతారు.
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూర్త్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్

అలాగే రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల వసంతుడు సంతోషిస్తాడని ప్రతీతి  . అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు.

శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమ నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.

నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశిని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.

ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.

కృష్ణ ద్వాదశినాడు తిలర్వాదశీ వ్రతంజరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగాపేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

Wednesday, 20 December 2017

జాతకం

మూఢమలో  శుభ కార్యాలకు నిషిద్ధం
శుభ, అశుభ ఘడియలను గురు,శుక్రులపై ఆధారపడి నిర్ణయిస్తుంటారు లో శుక్రుడు తొందరగా ఆస్తమించడాన్ని శుక్రమూఢమగా పేర్కొంటారు. శుక్రుడు దర్శనమివ్వని సమయంలో శుభకార్యాలకుతగు బలం ఉండదు. శుక్రమౌఢ్యమ 2017 నవంబర్ 30 నుంచి ప్రారంభమై 2018 ఫిబ్రవరి 19తో నివృత్తి  జరుగుతుంది 

 

Saturday, 14 October 2017

వాస్తు

వాయవ్యం వీధిపోటు 

ఉత్తర - పశ్చిమ దిశల మధ్య ఉన్న ప్రదేశాన్నే వాయవ్యంగా పరిగణిస్తారు. పశ్చిమ వాయవ్యం శుభాలను కలిగిస్తే,   ఉత్తర వాయవ్యం అశుభాలను కలిగిస్తుంది పశ్చిమ  వాయవ్యం  లాభాలను చేకూరుస్తూ  ఇంటి యజమాని నాయకత్వానికి అండగా నిలుస్తుంది. ఆ ఇంట అన్నీ సానుకూల ఫలితాలే . కలుగుతాయి. ఆ ఇంటి యజమానికి అన్నిశుభలే. కీర్తిని, ధనాన్ని ఆర్జిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరి ఆమోదాన్ని పొంది రాజకీయాల్లో  రాణింపును పొందుతారు.
ఉత్తర వాయవ్యం వీధిపోటు గృహ యజమానులను వెదుక్కుంటూ సమస్యలు .ఆ కుటుంబంలో ఉన్న యుక్తవయస్కులకు పెళ్లి కుదరకపోవటం, కుదిరినా ఆటంకాలు కలుగుతాయి . అంతేకాకుండా ఇంటిలో నివసిస్తున్న  మహిళలు అనైతిక విషయాల పట్ల ఆకర్షితులు  అవుతారు. జాతకాలు కూడా తోడయితే ఇక  ఇబ్బందుల తీరు చెప్పనక్కరలేదు.  సమస్యలతో జీవితాన్ని గడపాల్సివస్తుంది.

 

Thursday, 12 October 2017

నైరుతి వీధి పోటు

దక్షిణ - పశ్చిమ దిశలో ఉండే ప్రదేశం కొంత భాగం నైరుతి క్రిందకు వస్తుంది. ఈరెండు వైపులా వీధి ఎదురుగా ఉంటే అది నైరుతి వీధి పోటు అంటారు .  దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న గృహాలలో  నివశించే మహిళలఫై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.. సిరులకు, మహిళలకు ఇది చేటు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు గృహం ఆలవాలం అవుతుంది. ప్రతి అశుభాలకే దారి తీస్తుంది. దంపతుల మధ్య కలహాలు, ఆ ఇంట ఉండే స్త్రీలకు ఎప్పుడూ ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉంటుంది . చిన్న పనితలపెట్టినా  అవాంతరాలు  ఎదురవుతాయి.
పశ్చిమ నైరుతిని  పరిశీలిస్తే మరిన్ని ఆసక్తి కలిగించే అంశాలు తేటతెల్లం అవుతాయి. పశ్చిమ నైరుతి పురుషులపై దుష్ప్రా భావం కలిగిస్తుంది ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనం మాత్రం ఉండదు.

Monday, 9 October 2017

ఆగ్నేయం వీధి పోటు  

తూర్పు ఆగ్నేయం  వీధి పోటు  అశుభం. దక్షిణ ఆగ్నేయం వీధి  పోటు శుభం. మరికొన్ని సందర్భాలలో  ముందుకు  వెనుకకు జరిగి ఇంటి నిర్మాణాలను చేయడం వల్ల  కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతాయి.  ఆగ్నేయం అంటే అనర్దాలకు హేతువనే బలమైన వాదన కూడా ఉంది.ఐతే దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న గృహంలో   నివసించే  కుటుంబం తృప్తికరంగా, సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు .   వీరు బంధువులను చక్కగా ఆదరిస్తారు. ఈ ఇంట తలపెట్టిన ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంటికి తూర్పు వైపున ఉన్న ఆగ్నేయ వీధి పోటు అనేక సమస్యలు  మానసిక అశాంతికి హేతువు అవుతుంది , ఆదాయానికి మించిన ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య తరచూ తగాదాలు జరుగుతుంటాయి. వీటివల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.ఇలా కొన్ని వీధి పోట్లు మంచివి కాగా మరికొన్ని చేడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. ఏది ఏమైనా వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణుల సలహాలు తప్పనిసరి.