My site provides Vastu and Jathakam ....

Wednesday, 23 January 2019

కృష్ణాజినం దర్భమయించ

ఉపనయన  శుభపత్రిక శ్లోకం

కృష్ణాజినం దర్భమయించ మౌంజీ పాలాశ దండః పరిధాన శాఠీ I

యజ్ఞోపవీతంచ , దిశన్తు నిత్యం వటోశ్చిరాయుః శుభకీర్తి విద్యాః II


Monday, 7 January 2019

దేవాలయములు - వాటి ప్రత్యేకత

 దేవాలయములు - వాటి ప్రత్యేకత
వాస్తు శాస్త్రం ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి.   ఇలా ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన  ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంది. ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలం చేసిన నిర్మాణాల్లో కనిపిస్తాయి.

మాడవీధులలో విగ్రహము
ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది
పూరి జగన్నాథ స్వామి.
 చిదంబరం నటరాజ స్వామి.

ఇదీ శిల్పకళ 
కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.

భూమిపై ఆనని స్థంభములు
ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జున స్వామి కోవెలలో తొమ్మిది స్తంభాల మంటపం లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.

ఒక మంటపములో రెండు నటరాజ విగ్రములు

కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.

గరుడుడి విశ్వరూపం 
కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇస్తాడు

బరువు మారే గరుడ వాహనం
కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. స్వామి సన్నిధిలో వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ... బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.

కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో విగ్రహం
చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.

లింగాకారంలో మారేడు కాయలు
తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.

రంగులు మారే  శివలింగం
కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు

వింతనందీశ్వరుడు 
విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.

ఆంజనేయ విగ్రహం  ప్రత్యేకత 

ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.

విరించిపురం సమయ స్తంభము

 వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

మత్స్య అవతారామా?
 చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది

స్త్రీ రూపముతో నవగ్రహములు

ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటాయి.


Sunday, 6 January 2019

ఫలితం

 మీకుతెలుసా?

జపముఎలాచేస్తేఎంతఫలితంవస్తుంది
జపముఎక్కడచేస్తేఎంతఫలితం

జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః |
జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే ||

'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.

జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.
మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.
ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.

వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.

"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.

యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||

జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |
జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||

యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.

అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :

ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.

Thursday, 6 September 2018

Vaastu, Astrology, Jatakam in Telugu Birth Horoscope on line

సంప్రదించండి!!                                        


వాస్తు

నిత్యం ఆనందంగా ఉండాలంటే మనం నివసించే ఇల్లు బాగుండాలి. స్వగృహమైనా, అద్దె ఇల్లు అయినా వాస్తు సరిగా ఉండాలి. మనం నివశిస్తున్న ఇల్లు సరిగా లేకుంటే మనను వెదుక్కుంటూ సమస్యలు వస్తాయి. ముందుగా జాగ్రత్త పడితే జీవితం  ఆనందంగా గడుస్తుంది.  నూతన గృహాలు ఖరీదు చేసేముందు వాస్తు చూసి నివారణోపాయాలు వెదుక్కోవాలి.

జాతకం

జన్మకుండలి, వివాహం, శుభముహూర్తం,  జ్యోతిషవివరములు, గ్రహస్థితులు, జాతకం తెలుగులో
జాతక సమస్యలకు నివారణోపాయాలకోసం ఆన్‌లైన్లో సంప్రదించండి

వాస్తు - జాతకం రెండూ విభిన్న మైనవి.  కానీ ఎప్పుడో ఒకప్పుడు వీటి అవసరం అందరికీ తప్పనిసరి  కలుగుతుంది. ప్రాథమిక అవగాహన కలిగించడానికి ఎన్నో వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి . కానీ అవాసరానికి సరైన సమాచారం - సలహాలు లభించడం లేదు. అనుభవం ఉన్న జ్యోతిష పండితులు - వాస్తు నిపుణులు మీ సందేహాలకు ఆన్ లైన్లో సలహాలు ఇస్తారు.

ఆన్‌లైన్‌లో కానీ, నేరుగా కానీ సంప్రదించుటకు!!

మెయిల్   helpvastujatakam@gmail.com   
Whatsapp   +919963895914
Phone USA  001 732 328 8552

Saturday, 1 September 2018

ముహూర్తం చూడడం ఎలా?
శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః
మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//

          మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన   విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది.  కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.

ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.
౧) తారా బలం, ౨) చంద్ర బలం, ౩) లగ్న బలం, ౪) పంచక రహితం, ౫) ఏకవింశతీ మహా దోషాలు
వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.

ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం”  గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు.  అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.

  ఒక పని ముఖ్యంగా వైదిక సంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు  గ్రహించాలి.

పంచకరహితం అంటే?
ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.


అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2  అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.

కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.

అయితే తప్పని సరి పరిస్థితులలో .....

చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్

అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.

మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే " పంచక రహితం " అంటారు. 

ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04  ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.
ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం.

తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.

19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది.

వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే  గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.

తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.

నక్షత్రం అనూరాధ.  అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.

లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.

ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.

తిథి   +     వారము  +        నక్షత్రము +  లగ్నము
ఏకదశి +    గురువారం +    అనూరాధ +   మిథునం
11     +           5          +       17         +     3           =   36  దీనిని 9 తో భాగహరించాలి.

           9) 36 ( 4
               36
              -----
  శేషం       0 
              -----


సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది. 

చంద్ర బలం


చంద్ర బలం
ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.

జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో :  2-5-9
క్రిష్ణ  పక్షంలో :  4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.

అనగా శుక్లపక్షంలో చంద్రుడు  4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

తారాబలం చూడటం ఎలా?


తారాబలం చూడటం ఎలా?

   ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.   ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.

  1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.

ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి.  ఆ 27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి.  అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది.  మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.

పైవాటిలో  సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను,  ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.


జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.

చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.

ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.

ఉదాహరణ :  రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే,  ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి.   అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.

తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....

ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !

ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు   వదిలి పెట్టవలెను.

అంటే జన్మనక్షత్రము లగాయతు  1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.

అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి  1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.