My site provides Vastu and Jathakam ....

Tuesday, 16 July 2019

శ్రీవిష్ణు సహస్రనామ - విశిష్ట - శ్లోకాలు

శ్రీవిష్ణు సహస్రనామ - విశిష్ట - శ్లోకాలు


*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలుంటాయి. సహస్రం అంటే "వెయ్యి (1000)" అని అర్థం. వెయ్యి నామాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి. ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది.  ఒక్కో నక్షత్రం లోని నాలుగు నాలుగు శ్లోకాలు, ఇలా 27 నక్షత్రాలకు కలిపి మొత్తం 108 శ్లోకాలను ఋషులు అనుగ్రహించారు.
వీటిలో విశేష, విశిష్ట శ్లోకాలు కూడా ఉన్నాయి.
*ధనాభివృద్ధికి- విష్ణు సహస్రనామమే..*
*మంచి ఆరోగ్యానికి- విష్ణు సహస్రనామమే..*
*విద్యాభివృద్ధికి- విష్ణు సహస్రనామమే..*
*మనశ్శాంతికి- విష్ణు సహస్రనామమే..*

*ఇంతేనా..! ఇలా నిత్య జీవితంలో మానవులేదుర్కొనే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపింది మన "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం".*
 సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము. ఎవరి కోరికనను అనుసరించి వారు ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు  జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:*

*1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)*
*----------------------------------------*
*సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹*
*వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹*

*2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)*
*----------------------------------------*
*భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹*
*అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹*

*3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)*
*----------------------------------------*
*వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹*
*అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹*

*4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)*
*----------------------------------------*
*మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹*
*అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹*

*5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)*
*----------------------------------------*
*అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹*
*సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹*

*6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)*
*----------------------------------------*
*అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹*
*సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹*

*7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)*
*----------------------------------------*
*భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹*
*కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹*

*8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)*
*----------------------------------------*
*వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹*
*పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹*

*9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)*
*----------------------------------------*
*వైకుంఠ: పురుషః ప్రాణః   ప్రాణదః ప్రణవః పృథుః ౹*
*హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹*

*10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)*
*----------------------------------------*
*విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹*
*అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹*

 *11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)*
*----------------------------------------*
*యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹*
*సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹*

*12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)*
*------------------------------- ---------*
*అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹*
*శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹*

*13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)*
*----------------------------------------*
*శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹*
*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹*

*14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)*
*----------------------------------------*
*ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹*
*భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹*

*15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)*
*----------------------------------------*
*సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹*
*శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹*

 *16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)*
*----------------------------------------*
*సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹*
*న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹*

*17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)*
*----------------------------------------*
*సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |*
*అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||*

*18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)*
*----------------------------------------*
*సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹*
*స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹*

*19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)*
*----------------------------------------*
*అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹*
*శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹*

*అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹*
*విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹*

*20. దుస్వప్న నాశనమునకు:(99 వ శ్లోకం)*
*----------------------------------------*
*ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹*
*వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹*

*21. పాపక్షయమునకు: (106 వ శ్లోకం)*
*----------------------------------------*
*ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹*
*దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ౹౹*

****🙏 *జై శ్రీ మన్నారాయణ* 🙏

Saturday, 16 March 2019

భగవంతుడికి యజ్ఞం అంటే చాలా ఇష్టం

 మాఘ పంచమి - మా ఇంటిలో సుదర్శన హోమం


ఈ రొజు మనం అద్భుతైవెునటువంటి యజ్ఞంలో పాల్గొన్నాం.సుదర్శన హోమం అనేది  సంద్రాయంలో ఉండే వారికి అమితంగా ఇష్టపడే హోమం.భగవంతునికి ప్రేవుగా చేసేది ఏదైనా దానిని యజ్ఞము అని భగవద్గీతలో అంటారు కృష్ణపరమాత్మ. మనం చేసేపని ఏదైనా కావాచ్చు, విద్యాభ్యాసం కావచ్చు, ఉద్యోగంకావచ్చు, వ్యాపారంకావచ్చు, వ్యవసాయంకావచ్చు ఏది చేసినా సరే అది భగవంతుడికి చేసే ఒక సేవ అని ఆనుకుంటే ప్రతీపని భగవత్ సేవే అనుకుంటే దాని సేవే యజ్ఞం. దాని మీద మనకు ప్రేవుకలగాలి. అదేదో కష్టంతోకాకుండా ఇష్టంతో చేయాలి. ఇష్టం చేసేప్పుడు అదికూడా మంచి సత్‌ఫలితాలను అందిస్తుంది. భగవంతుడికి యజ్ఞం అంటే చాలా ఇష్టం. అంటే ఏపైనెనా యజ్ఞంమే ప్రేమతో చేస్తె. ఉదారహరణకి వేదపండితులు యజ్ఞం చేస్తారు. ఇది కూడా భగవంతుడి సేవ అనుకుంటే దీనిపేరే యజ్ఞం. యజ్ఞాలలో మూడురకాల యజ్ఞాలు ఉన్నాయి. అవి వాంచిత యజ్ఞాలు, రాజస యజ్ఞాలు, తామస యజ్ఞాలని మూడురకాల యజ్ఞాలు. ఈ రోజు లోకంలో అనేకపేర్లతతో యజ్ఞాలు చేస్తున్నారు. సాత్విక యజ్ఞం ఏమిటంటే ఫలితం కొంచెం ఆలస్యంగా మొదలవుతుంది. కానీ శాశ్వతంగా ఫలితాలు ఇస్తూనే ఉంటుంది. కానీ తామస యజ్ఞాలు, రాజస యజ్ఞాలు వెంటనే ఫలితాలు ఇస్తాయి. కానీ దానివల్లనే  మళ్లీ కొన్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. అలాంటి సాత్విక యజ్ఞాలలో కోర్కెలు తీర్చడానికి కొన్ని యజ్ఞాలు ఉన్నాయి. ఏదైన గ్రహబాధలుంటే తీర్చడానికి నృసింహయుష్టి, విద్యలో రాణించాలంటే హయగ్రీవ యష్టి అని, సంతానం కోరుకునే వారికి సత్‌సంతానం కావాలంటే వైనతేయ యష్టి అనిఇట్లా ఒక్కోక్క కోరికకు ఒక్కోక్క రకాల యష్టి యాగాలు ఉన్నాయి శ్రీపాంచరాత్ర ఆగమంలో అలాగే జీవించిన వారేకాకుండా గతించినవారికి ఉత్తమ గతి కావాలన్నా, ఉన్నత మార్గంలొ వెళ్లాలన్నా లేదా మోక్షానికి పరవుపదానికి వాళ్ళువెళ్లాలన్నా, వారు సంప్రదాయంలో వాళ్లులేరు. సంప్రదాయం అంటే వారికి తెలియుదు. సమాస్రయాలు కూడా వాళ్లు కాలేదు. మంత్రోపదేశంకాలేదు. లేదావారు ఉన్నంతకాలం ఇతర మార్గాలలో ఉన్నారు. గతించిపోయారు. కానీ మనం ఇవాళ వైష్ణవ మార్గంలో ఉన్నాము. ఇవాళ పంచ సంస్కారాలు పొందాము. మంచి ఆచారున్ని మనం ఆశ్రటయించాం. ఆష్టాక్షరీ మంత్రోపదేశం మనం పొందాం. కచ్చితంగా మనకు మోక్షమే. కని వాళ్లకెట్లాగ మోక్షం?! అంటె ఇతర మార్గాలలో జీవింస్తూ గతించిన వారికి కూడా పరవుపదాన్ని ఇవ్వాలంటే, మోక్షాన్ని ఇవ్వాలంటే దానికి కూడా యజ్ఞం ఉంది. ఇలా అనేకరకాల యజ్ఞాలు ఉన్నాయి. మిగిలిన యజ్ఞాలకన్నా ఈరోజు మనం చేయించే సుదర్శన యజ్ఞం ఉందే ఇది కొంచెం భిన్నైవెునది. ఇది కొంచెం కష్టైవెునది. క్లిష్టైవెునది. ఇందాక చెప్పిన యజ్ఞాలు చదువురావాలని యజ్ఞం చేసుకోవాలన్నా, సంసారంకోసం, వివాహంకోసం మన మన కోర్కెలు తీర్చడానికోసం చేసే యజ్ఞాలు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. ఎలా అలా చేసుకోవచ్చు. ఒక్క సుదర్శన యజ్ఞంతప్ప ఈ సుదర్శన యజ్ఞం అంటే ఏమిటో తెలుసా? ముహుర్తం మనంపెట్టుకుంటే అవదు.
చాలామంది అయో మేము కూడా చేసుకోవాలండి, చేసుకోవాలండి అనుకుంటారు. ముహుర్తాలు దొరకవు.  ఎప్పుడు దొరుకుతుంది? ఆయన ఎప్పుడు ముహుర్తం అనుకుంటే అప్పుడే దొరుకుతుంది. ముహూర్తం పెట్టేది ఆయనే, నే ఫలానా వాళ్ళను పిలవాలనుకుంటున్నానండి. వాళ్ళు రారు. అనుకోకుండా ఎవరో మరొకరు వస్తారు. అంటే ఎవరితో చేయించుకోవాలో పంపించేది వారే. ముహూర్తాన్నా అందించేది వారే . ఎవరెవరిని యజ్ఞానికి రావాలనుకుంటారో రప్పించేది వారే. కనుక భగవంతుడికి ఇలాంటి యజ్ఞాలంటే చాలా ఇష్టం. అందుకే విష్ణుసహస్రనామంలో భగవంతుడికి వేయినామాలున్నాయి కదా! ఒక్కో పేరు ఒక విశేషాన్ని అందించేది. కాని యజ్ఞం అనేపేరుతో సంబంధంగా పదకొండు పన్నెండునామాలు పక్క పక్కనే ఉన్నాయి.
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః
యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ

phalguna masam

పాల్గుణ మాసం విశిష్టత

ఫాల్గుణ మాసం సర్వదేవతా వ్రత సమాహారం. చైత్రాది మాసాల క్రమంలో చివరిది ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం.  ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గునికి బుద్ధి వికాసాన్ని ధైర్య స్థిర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం.
ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథి విశేషమే!  శిశిర ఋతువుకు ముగింపు. ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది.
 ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం చేస్తారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశిగా వ్యవహరిస్తారు. చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు.
విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు  క్షీరాన్నం, లేదా పాలు నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఈ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ఆమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం.
పౌర్ణమిని ఉలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి ఊపుతారు. డోలికా పూర్ణిమ అంటారు. రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. ఫాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు.

Thursday, 14 February 2019

Bheeshma Ekadasi

  భీష్మ ఏకాదశి  పర్వదినం

భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని ‘భీష్మాష్టమి‘ గాను, మాఘశుద్ధ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి‘  పర్వదినంనాడు శ్రధ్ధగా తర్పణం వదలాలి . ఈరోజు  తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని అంతేకాకుండా  పితృ దోషనివారణ, వివాహ ప్రాప్తి జరుగుతుందని విస్వాసం ధర్మరాజుకు విష్ణుసహస్తన్రామ స్తోత్రాన్ని ఉద్భోదించిన పరమ పవిత్రమైన తిధి ఏకాదశి . తర్పణం వదలలేని వారు ఈ రోజు శ్రీ విష్ణువును పూజించిన వారికి కోరికలు తీరుతాయని ప్రతీతి విష్ణుసహస్తన్రామ స్తోత్రాన్ని పఠించాలి.  "ఓం నమోనారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రమును 108 సార్లు జపించాలి.

తర్పణ విధానం

అథ తర్పణ ప్రయోగః ఆచమ్య | |
ప్రాణానాయమ్య | | ఏవంగుణ . . . శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , మాఘ శుక్లాష్టమ్యాం /
మాఘ ఏకాదస్య  తర్పణం కరిష్యే | |
 ఇతి సంకల్ప్య ( అని ఇట్లు సంకల్పమును చేసి తర్పణము చేయవలెను . )
1 . వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | గంగాపుత్రవర్మాణం తర్పయామి | | ( 3 సార్లు )
2 వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | భీష్మవర్మాణం తర్పయామి | | | ( 3 సార్లు ) . వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | అపుత్రవర్మాణం తర్పయామి | | సార్లు )
 భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియ :
 ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ II ( ఇతి తర్పయిత్వా ) అని మరొకమారు తిలోదకమును విడువవలెను . )
 పునరాచమ్య | సవ్యేన అర్ఘ్యం దద్యాత్ |
 | ( తిరిగి ఆచమించి తూర్పుముఖముగా సవ్యముతో దేవతీర్థముద్వారా అర్ఘ్యమును ఈయవలెను . ) వసూనామవతారాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి )
2 శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) భీష్మాయ అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి II ( ఒకసారి ) | | ఇతి  |
భీష్మతర్పణవిధిః
| | |  భీష్మతర్పణవిధిః సమాప్తము

Wednesday, 23 January 2019

కృష్ణాజినం దర్భమయించ

ఉపనయన  శుభపత్రిక శ్లోకం

కృష్ణాజినం దర్భమయించ మౌంజీ పాలాశ దండః పరిధాన శాఠీ I

యజ్ఞోపవీతంచ , దిశన్తు నిత్యం వటోశ్చిరాయుః శుభకీర్తి విద్యాః II


Monday, 7 January 2019

దేవాలయములు - వాటి ప్రత్యేకత

 దేవాలయములు - వాటి ప్రత్యేకత
వాస్తు శాస్త్రం ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి.   ఇలా ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన  ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంది. ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలం చేసిన నిర్మాణాల్లో కనిపిస్తాయి.

మాడవీధులలో విగ్రహము
ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది
పూరి జగన్నాథ స్వామి.
 చిదంబరం నటరాజ స్వామి.

ఇదీ శిల్పకళ 
కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.

భూమిపై ఆనని స్థంభములు
ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జున స్వామి కోవెలలో తొమ్మిది స్తంభాల మంటపం లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.

ఒక మంటపములో రెండు నటరాజ విగ్రములు

కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.

గరుడుడి విశ్వరూపం 
కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇస్తాడు

బరువు మారే గరుడ వాహనం
కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. స్వామి సన్నిధిలో వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ... బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.

కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో విగ్రహం
చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుంకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.

లింగాకారంలో మారేడు కాయలు
తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.

రంగులు మారే  శివలింగం
కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు

వింతనందీశ్వరుడు 
విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.

ఆంజనేయ విగ్రహం  ప్రత్యేకత 

ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.

విరించిపురం సమయ స్తంభము

 వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

మత్స్య అవతారామా?
 చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది

స్త్రీ రూపముతో నవగ్రహములు

ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటాయి.


Sunday, 6 January 2019

ఫలితం

 మీకుతెలుసా?

జపముఎలాచేస్తేఎంతఫలితంవస్తుంది
జపముఎక్కడచేస్తేఎంతఫలితం

జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః |
జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే ||

'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.

జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.
మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.
ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.

వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.

"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.

యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||

జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |
జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||

యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.

అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :

ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.