My site provides Vastu and Jathakam ....

Saturday, 28 December 2019

ధనుర్మాసం

  ఆండాళ్ ఆరాధన 


ధనుర్మాసం అంటే  ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం మన సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
ఆండాళ్ తల్లి ఆరాధన, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని అంటారు. ధనుర్మాసంలో  తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. కోరికలు ఈడేరడానికి  ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో  తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆండాళ్ తల్లి అనుగ్రహం కలుగుతుందని విస్వాసం. వేదమనైతుక్కుంవిత్తాగుం  అంటారు తిరుప్పావై అంటే వేదమంతటికి మూల బీజము . ఈ తిరుప్పావైలోని ముపై పాశురాలు నాలుగు వేదాలలోని సారము. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. అమ్మకటాక్షం కలిగితేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భూదేవియే శ్రీ ఆండాళ్తల్లిగా అవతరించి తిరుప్పావై మన కందించింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. 
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో గోదాదేవి స్వామిని కీర్తించేది.  మనలో ఎన్ని దోషాలున్నప్పటికి వాటిని తొలగించిపరమాత్మను చేరుకోవడానికి ధనుర్మాస అనుగ్రహిస్తున్నాడు.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయి. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాస వ్రతంతో ఆతల్లి మనందరిలో ప్రేమను నింపి ఆ ప్రేమ పాశముచేతభగవంతునిచే బంధించే ఉపాయాన్ని అనుగ్రహించింది.  మాసానాం మార్గశీర్షం  అని చెప్పుకున్న పుణ్యకాలము భగవత్ ప్రాప్తి కొరకు శరణాగతిని ఉద్బోదించే పరమ పవిత్రకాలము ఈ ధనుర్మాసము.

-
*యాజ్ఞికదర్శిని అంతర్జాల పత్రికలో ప్రచురించిన వ్యాసం*

Thursday, 19 December 2019

సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం

 సూర్యగ్రహణం -  షష్ఠగ్రహకూటమి ప్రభావం

డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది.  ఆరుగ్రహాల కలయిక ధనుస్సు రాశిలో జరుగుతున్నప్పుడు గ్రహణం సంభవిచడం దుష్ప్రభావాలకు దారితీస్తోంది.  
 సూర్యగ్రహణం ప్రభావం మనపైన పడకుండా ఉండటానికి జాగత్త పడితే వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణముతో సత్ ఫలితాలు సాధ్యం.

లోక కల్యాణమునకు 97,98 శ్లోకాలు పఠించాలి

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹
విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹
  

సూర్యగ్రహణం - ఆయా రాశులపై  ప్రభావం

 మేష రాశి:-
 గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది ఇది మిశ్రమ ఫలితాలకు దారితీస్తుంది. . తొమ్మిదో స్థానం భాగ్య స్థానంలో గ్రహణ స్థితి వలన ఈ రాశివారికి కొంత తార్కిక వాదన  ఖండించే మనస్తత్వం ఏర్పడటం జరిగే అవకాశం ఉంది. 
 వృషభ రాశి:-
గ్రహణం 8వ స్థానంలో సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది. సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు. పెట్టుబడుల విషయంలో  జాగ్రత్త!
మిధున రాశి:-
 గ్రహణం 7వ  స్థానంలో సంభవిస్తున్నది. సప్తమ స్థానం వైవాహిక జీవితానికి వ్యాపారానికి సంబంధించినది. 
 వైవాహిక జీవితంలో,  వ్యాపార భాగస్వామ్యాల విషయంలో పట్టుదల తగదు. 
కర్కాటక రాశి:-
గ్రహణం 6వ  స్థానంలో సంభవిస్తుంది. 6వ  స్థానం అనుకూల స్థానం. వృత్తిలోఅనుకూల ఫలితాలు.  కోర్టు కేసులు,  వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
సింహ రాశి:-
 గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తున్నది. 5వస్థానాన్ని పంచమ స్థానం అంటారు.  బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతకు సంభందించిన విషయాలలో ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలే ఎక్కువ. ఫై విషయాలలో జాగ్రత్త అవసరం.  
కన్య రాశి:-
 గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది. 4వ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు సంబంధించినది. ఇక్కడ కూడా వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలు ఉన్నాయి.  ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. 
తులా రాశి:- 
గ్రహణం మూడవ స్థానంలో సంభవిస్తుంది. 3వ స్థానం అనుకూల స్థానం.   చేపట్టిన పనుల్లో విజయం సాధించే
అవకాశాలు ఉన్నాయి. 
వృశ్చిక రాశి:- 
 గ్రహణం 2వ స్థానంలో సంభవిస్తున్నది.2వ  స్థానం ధనానికి, కుటుంబానికి,  మాటకు సంభందించినది. జాగ్రత్త అవసరం. వాదప్రతివాదాలు తగదు
.ధనస్సు రాశి:- 
 గ్రహణం 1వ స్థానంలో సంభవిస్తున్నది.  ఇది అనుకూల  స్థానంకాదు.  తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మకర రాశి:- 
 గ్రహణం 12వ స్థానంలో సంభవిస్తున్నది. 12వ  స్థానం ఖర్చులకు,  విదేశీ యానానికి,  ఆరోగ్య సమస్యలకు సంబంధించినది. తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. 
కుంభ రాశి:- 
గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం. అనుకూల స్థానం.  అన్ని శుభఫలితాలే. 
మీన రాశి:-
గ్రహణం 10వ స్థానంలో సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి,  పేరు ప్రతిష్టలకు సంబంధించినది.  వ్యతిరేక ఫలితాలకు ఆస్కారం. 

షష్ఠగ్రహకూటమి

ధనస్సురాశిలో షష్ఠగ్రహకూటమి సంభవించనుంది. ఇదే సమయంలో గ్రహణ సంభవం యదృర్శిచికం .గ్రహణం సంభవిచే ప్రాంతాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా షష్ఠగ్రహకూటమి ప్రభావం ఉంటుంది.
ధనస్సురాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్న ఆరు గ్రహాలు గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు . 2019 డిసెంబర్ 25, 26, 27 తేదీలలో  షష్ఠగ్రహకూటమి సంభవించనుంది
2019 డిసెంబర్ 28 నుంచి 2020 జనవరి 1 వరకూ గురు, శని, కేతు, సూర్య,  బుధులు అయిదు గ్రహాలు కలసి ధనస్సురాశిలో ఉంటాయి. ఈ 15 రోజుల ఫలితాలు విశ్లేషిస్తే ఆలోచించే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. 
గ్రహకూటమి ప్రయాణాన్ని గమనిస్తే తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి వెళ్లగా, మిగిలిన నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. 
ఇక్కడ గురు - శనుల పాత్ర ముఖ్యమైనది. ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో గురు - శనులు కలుస్తారు.
గురు - శనులు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  మార్పులు తధ్యం. గతంలో జరిగాయి. ఎందుకంటే గురు, శని గ్రహాల గమనంతోనే  జాతకంలో మార్పులు జరుగుతాయి.  ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనస్సు రాశి తోపాటు, ధనస్సుకు ఎదురుగా ఉండే మిధునరాశికి కూడా సమాన ఫలితాలు ఉంటాయి. రాశులకు సంభంధించిన దేశాలలో కూడా మార్పులు, నష్టం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి ధనస్సు రాశి ద్వాదశ ఫలితం ఉంటుండి, అదేవిధంగా అమెరికాను సూచించే మిధునరాశి ధనస్సుకు ఎదురుగాఉండటాన్ని గమనించి జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో లగ్నసమయం గుర్తించే విధానము

ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా లగ్నం రాశిని ఎలా గుర్తించాలి? సాధారణంగా ఇది అందరికీ కలిగే సందేహమే. అమెరికాలో నేటి ఉదయం ఏలగ్నం. అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఆలోచన మొదలవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తిముగా సూర్యుడే ప్రామాణికం అని గ్రహించాలి.
పన్నెండు రాశులు 12 లగ్నములు. అవి 1 ) మేషము 2 ) వృషభము 3 ) మిధునము 4 ) కర్కాటకం 5 ) సింహం 6 ) కన్య 7 ) తుల 8 ) వృశ్చికం 9 ) ధనస్సు 10 ) మకరం 11 ) కుంభం 12 ) మీనం
రోజుకు 24 గంటలు. అంటే 12 లగ్నములు ప్రతిరోజూ ఉంటాయి. ప్రతిలగ్నం సమయం రెండుగంటలు
 పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి.
ఉదాహరణ: ఒక రోజు  ఉదయం 06-05 నుండి 08-04 ని.ల వరకు  మకరలగ్నం ఉంది.
తరువాత ఏలగ్నం?
ఇంకేమిటి ఉంటుంది?
మకరం తరువాత కుంభమే  కదా! :- ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.
ఏ లగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు?
మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు? సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.
నక్షత్రాలు - రాశులు
నక్షత్రాలు - రాశులు

      కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.  ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.  - అని పురాణ కథ 

ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.



అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం

Tuesday, 10 December 2019

పంచకరహితము

పంచకరహితము అంటే...


శ్లో . తిథివారోడుభిర్యు క్తం తత్కా  లోదయమిశ్రితం
 నవసంఖ్యా హ రేద్భాగం శేషంపంచక మీరితమ్.

వివాహముహూర్తం తిథి వార నక్షత్రముల సంఖ్యను మొత్తము చేసి యప్పటి సంఖ్యను చేర్చి 9 చే భాగించవలెను . అట్లు భాగించగా మిగిలిన శేషము 3, 5, 7, 9 సంఖ్యలలో వొకటి వచ్చినా పంచకరహితమైనట్లు గ్రహించవలెను
ఉదా : - వివాహముహూర్తము చైతశుద్ధదశమినాడు అని అను కొందము . ఆనాడు తిధి నవమి . వారము బుధవారము . నక్షత్రము రోహిణి . లగ్నము కన్య  . తిథి నవమి  9 + వారము 4 + నక్షతము 4 + లగ్నము 6 + మొత్తము 23 ను 9 చే భాగించిన 5 వచ్చినది.  పంచకరహితమైనదిగా నిర్ణయింపవలెను .

పంచకరహితఫలములు

శ్లో . ఏకో మృత్యుర్ద్వయం వహ్నిశ్చత్వారో రాజపంచకం
షట్చోరో ఇష్ట రోగస్స్ల్యాది  త్యేత త్పంచకం స్మృతం

 శేషము వచ్చిన సంఖ్య దిగువ ఉదహరించిన విధముగ ఫలితములు ఉండును
 1 . మృత్యుపంచకము దీనియందు వివాహము చేసిన వధూ వరులకు మరణప్రాప్తియగును .
2 . వహ్ని పంచకము - దీనియందు వివాహ మొనర్చిన అగ్ని చే  ఆపదకలుగును .
4 . రాజ పంచకము - దీనియందు వివాహ చేసిన  రాజకీయసంబంధమైన చిక్కులు కలుగును .
6 . చోర పంచకము - దీనియందు వివాహము చేసిన సొత్తు దొంగలపాలు అగును.
8 . రోగ పంచకము - దీనియందు వివాహమొనరించిన వధూవరులు రోగయుక్తులై బాధలను అనుభవింతురు .

మరో ముఖ్య విషయం కొన్ని సందర్భాలలో కొన్ని పంచకములను వదలివేయవలెను
ఆదివారమునాడు రోగ పంచకమును, శనివారమునాడు మృత్యుపంచకమును, మంగళవారమునా అగ్ని పంచకమును, సోమ, గురువారములందు రాజపంచకమును బుధశుక్రవారములయందు చోరపంచకమును విడువవలయను .  రాత్రిముహూర్తమునందు చోరరోగపంచకములను , పగటి ముహూర్తమునందు రాజాన్ని పంచకములను , అర్ధరాత్రి  మృత్యుపంచకమును విడువవలెను.

Friday, 20 September 2019

గ్రహదోషనివారణకు సుందరకాండ పారాయణము

గ్రహదోషనివారణకు 
సుందరకాండ పారాయణము 

సోమస్య చే ద్దశా   దుష్టా తస్యా శాంత్యర్థ మాదరాత్ ,
 ‘తత స్స మధ్యంగత ' మి త్యముం సర్గం పఠే న్ని శి ,
శుక్లపక్షే ప్రదోషే చ తత శ్చంద్రం ప్రపూజయేత్ . 
చంద్రమహాదశ అనుకూలముగ లేకున్నచో ' తత స్స మధ్యం గత . . . ' ఇత్యాది శ్లోకముతో మొదలగు సుందరకాండ పంచమసర్గను శుక్లపక్షమున చీకటి పడుట తోడనే మొదలు పెట్టి ప్రతిదినము పారాయణ చేయవలెను . పిమ్మట చంద్రుని పూజింపవలెను ,

కుజదశా దోష నివారణకు 

గురో శ్చే ద్దోషదా భుక్తి ర్భౌమస్య తు దశాంతరే , 
ఉపదేశం హనుమతో రావణస్య తదా పఠేత్ . 
కుజమహాదశలో గుర్వంతర్దశ దోష ప్రద మగుచో హనుమంతుడు రావణునకు చేసిన యుపదేశము (51వ సర్గ) పారాయణ చేయనగును .

 శుక్రభుక్తి  ర్దోషదా చే ల్లోహితాంగ దశాంతరే , 
సీతాయాః ప్రార్థనం వహ్ని ముద్దిశ్య హనుమత్కృతే , 
యత్ర తం సర్గ మాధ్యాయ న్నాంజనేయం పఠేత్ క్రమాత్ 

కుజమహాదశలో శుక్రాంతర్దశ ప్రతికూలముగ నున్నచో , నపుడు సీతాదేవి హనుమంతుని కొఱకై యగ్ని ప్రార్థనము చేసిన ఘట్టము ( 58 వ సర్గ) ను ఆంజనేయుని ధ్యానించుచు పఠింపవలెను . 

రాహుదశా దోష నివారణకు 

కవే ర్భుక్తి రనర్థా చే తైసం త్సైం  హికేయ దశాంతరే , 
హనూమతా రాఘవాయ చూడామణ్యర్పణం ప ఠేత్ . 

రాహుమహాదశలో గుర్వంతర్దశ కష్టములు కలిగించుచున్నచో హనుమంతుడు రామునకు చూడామణిని సమర్పించు ఘట్టము ( 65వ సర్గ పారాయణ చేయవలెను . 

శనైశ్చరస్య భుక్త్యాం చే ద్దోషో  రాహుదశాంతరే , 
హనూమతాక్ష నాశాఖ్య సర్గ పారాయణం చరేత్ . 

రాహుమహాదశలో శన్యంతరము క్లేశ కరముగనున్న చో హనుమంతు . డక్షరాక్షసుని సంహరించుఘట్టము ( 47 వ సర్గ ) పారాయణ చేయవలెను .

గురుదశా దోషనివారణకు 

గురో ర్దశా చే దుగ్రా స్యా త్తథా సుందరకాండకే , 
పఠే త్సముద్రతరణసర్గ మేకం హనూమతః , 
అంతే చ సీతయా మిశ్రాన్ లా జాన్ హనుమతేర్పయేత్.  

గురుమహాదశ లో కష్టము లకు గురియగుచున్నచో హనుమంతు , సముద్రము దాటు ఘట్టము ( 1వ సర్గ ) పారాయణ చేయుచు , పారాయ ణాంతమున చక్కెర కలిపిన పేలాలను నివేదించవలెను . 

కేతు భుక్త్యాం  భవే త్పీడా గురో ర్యది దశాంతరే ,
 పఠే న్మధువనధ్వంస సర్గ ద్వయ మనుత్తమమ్ . 

గరుదశలో కేత్వంతరము పీడాకరమగుచో వానరులు మధువనము ధ్వంసము చేయు ఘట్టము ( 61 , 62 సర్గలు ) పారాయణ చేయవలెను .

 శనిదశా దోష నివారణకు 

శనేర్గశాయాం భుక్తి శ్చే చ్చనేరే వాహితా భవేత్ ,
 బ్రహ్మాస్త్ర బంధముక్త్యాఖ్యం పఠే త్సర్గం హనూమతః . 

శనిమహాదశ లో శన్యంతర్దశ కష్టములు కలిగించు చున్నచో  హను మంతుడు బ్రహ్మాస్త్రబంధము నుండి విముక్తి నొందిన ఘట్టము ( 46వసర్గ పారాయణ చేయవలెను . 

శనే ర్దశాయాం సౌమ్యస్య భుక్తి శ్చేత్ క్లేశ దాయినీ , లంకాదాహం హనుమతా కృతం సర్గం తదా పఠేత్ . 

శనిమహాదశలో బుధాంతరము క్లేశములు కలిగించుచున్నచో , హను మంతుడు లంకను తగులబెట్టు ఘట్టము ( 54 వసర్గ  ) పఠించవలెను .

శనే ర్ధకాయాం శుక్రస్య భు క్తి ర్యది విపత్ర్పదా,  
 చూడామణి ప్రదానాఖ్యం పఠే త్సర్గం హనూమతే . 

శనిమహాదశలో శుక్రాంతరమున బాధలు కలుగుచో హనుమంతు సీతాదేవి చూడామణి నిచ్చిన ఘట్టము ( 38వ సర్గ ) పఠించవలెను .

 బుధదశాదోష నివారణకు 

దశా బుధస్య దుష్టా చేత్ సీతాగ్రే హనుమత్కృతం , శ్రీరామవర్ణనం సర్గం పఠే. త్సంపూజ్య రాఘవమ్ , పఠనాంతే రాఘవస్య ముద్గాన్నం విని వేదయేత్ . 

బుధమహాదశ క్లేశకరముగ నున్న చో రాముని పూజించి సీతాదేవి యెదుట హనుమంతు డొనర్చిన రామవర్ణన ఘట్టము ( 35వ సర్గ పఠింప వలెను.) పారాయణానంతరము పొంగలి నివేదింపవలెను . 

బుధస్య చే ద్దశాయాం తు భౌమభుక్తిస్తు పీడయేత్ సీతాశుభ నిమిత్తాఖ్యం సర్గం షడ్వార మాపఠేత్ . 

బుధమహాదశలో కుజభుక్తి బాగుగాలేనిచో సీతాదేవికి కుభశకునము లగ పడుట అను ఘట్టము ( 27వ సర్గ ) ఆరుమారులు పారాయణ చేయవలెను 

కేతుభుక్తి  ర్దోషదా చే దుృధస్యాథ దశాంతరే
 హనూమతా శోక వనే  సీతాన్వేషణ మాపఠేత్ . 

బుధమహాదశలో కేతుభుక్తి  పీడాకరముగ నున్నచో , హనుమంతు డశోకవనమందు సీతాదేవిని వెదకుట యను ఘట్టము ( 14 వ సర్గ ) పఠించవలెను .


కేతుదశా దోషనివారణకు 

శుక్రభుక్త్యాం తు దోష శ్చే  త్కేతో రేవ దశాంతరే , హనూమదుక్తం రామాయ సీతాదర్శన మాపఠేత్ . 

కేతుమహాదశలో శుక్ర  భుక్తి బాధలు కలిగించుచో హనుమంత రామునకు చెప్పిన - సీతాసందర్శన ఘట్టము ( 65 వ సర్రసర్గ) పారాయణ చేయవలెను . 


శుక్రదశా దోష నివారణకు 

తత్ర్పెవ  శుక్రభుక్తి  శ్చేత్ ప్రాణినాం దోషకారిణీ , 
అంగుళీయ ప్రధానస్య సర్గం సుందరకాండజం , 
పతే తొషవణం భక్త్యా పూజయిత్వా మహీసుతామ్ . 

శుక్రమహాదశ యందలి శుక్రాంతరమున కష్టములు కలుగుచున్న చో సుందరకాండ మందలి హనుమంతుడు సీతాదేవికి అంగుళీయక ( ముద్రికా ) ప్రదానము చేసిన ఘట్టము ( 36వ సర్గ మూడు పూటలును స్నానము చేసి సీతాదేవిని ధ్యానించి పఠించవలెను . 

సా చే ద్భు క్తి రోషదా స్యాత్ స్త్రీణాం తత్త్రెవ  కాండ కే , 
సీతాయా ఆంజనేయేన సంవాదస్య తు సర్దకం , శృణుయు స్తా అర్థతశ్చ శబ్దతశ్చ ద్విజాననాత్ .

 స్త్రీలకు ఈ శుక్రమహాదశయందు శుక్రాంతరము దుష్టముగా నున్నచో వారు బ్రాహ్మణుని వలన సీతాదేవి ఆంజనేయునితో మాటలాడు ఘట్టము 33 వ సర్గ అర్థముతో గూడ వినవలయును .

Thursday, 15 August 2019

యజ్ఞోపవీత ధారణ విధి

యజ్ఞోపవీత ధారణ విధి
ఆచమనము ( కుడిచేతిని గోకర్ణాకృతిలో పట్టుకొని మూడు మారులు జలమును పుచ్చుకొనవలయును ) .
 ఆచమ్య   ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా  ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమ ః   ఓం విష్ణవే నమ ః ఓం మధుసూదనాయ నమః  ఓం త్రివిక్రమాయ నమ ః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమ ః ఓం హృషీకేశాయ నమ ః ఓం పద్మనాభాయ నమ ః  ఓం దామోదరాయ నమ ః ఓం సంకర్షణాయ నమ ః ఓం వాసుదేవాయనమ ః ఓం ప్రద్యుమ్నాయ నమ ః  ఓం అనిరుద్దాయ నమ ః  ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమ ః  ఓం అచ్యుతాయ నమ ః  ఓం జనార్ధనాయ నమ ః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమ ః ఓం శ్రీ కృష్ణాయ నమ ః
 ఉత్తిష్ఠను భూతపిశాచాః యేతే భూమిభారకాః
 ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఓం పృథివ్యా ః మేరో ః పృష్టఋషి ః కూర్మోదేవతా సుతలం ఛందః  ఆసనే వినియోగః   అనంతాసనాయ నమః
 ప్రాణాయామము
ప్రణవస్య పరబ్రహ్మఋషి ః పరమాత్మాదేవతా దైవీ
గాయత్రీ ఛంద ః . ప్రాణాయామే వినియోగః
ఓం భూః  ఓం భువః ఓగ్‌ం సువః  ఓం మహః ఓం జనః ఓం తపః  ఓగ్‌ం సత్యం  ఓం తత్ సవితు ర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి  ధియో యో నః ప్రచోదయాత్  ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్   సంకల్పము శ్రీ గోవింద - గోవింద - గోవింద - శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళేముహూర్తే అత్ర పృధివ్యాం జంబూద్వీపే... (దేశకాల పరిస్థితులను అనుసరించి అంటే అమెరికాలో వున్నవారు వారి ప్రాంత సంకల్పము చేయవలెను)  భరతవర్ష భరతఖండే మేరో ః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ( ఆగ్నేయ ) ప్రదేశే , శ్రీ కృష్ణా గోదావర్యోర్మద్యదేశే ( శ్రీ కృష్ణాకావేర్యోర్మద్యదేశే ) , లక్ష్మీ నివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ  అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే , శ్వేతవరాహకల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .... నామ సంవత్సరే  .... యనే వర్ష ఋతౌ .... మాసే శుక్ల పక్షే ...... తిధౌ ...... శుభవాసరే , శుభనక్షత్రే , శుభయోగే , శుభకరణ , ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ  మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ భగవాదాజ్ఞయా భగవత్ కైంకర్య యోగ్యతా సిద్ద్యర్థం శ్రౌత  , స్మార్త , నిత్య కర్మాద్యనుష్టాన , గృహస్తాశ్రమ ధర్మ సిద్ద్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే .
( అని సంకల్పము పఠించి ఎడమచేత ఉద్ధరణితో నీటిని తీసికొని కుడిచేతిలో పోసుకొని పాత్రలో విడువవలెను . )
 ఓం అపో హిష్ఠా మయోభువః  తాన ఊర్జే దధాతన  మహేరణాయ చక్షసే  యో వశ్శివ తమో రసః తస్య భాజయతే హ నః  ఉశతీరివ మాతరః  తస్మాణరంగమామ వః  యస్య క్షయాయ జిన్వథ  ఆపో జనయథా చ నః   ( అను మంత్రముతో యజ్ఞోప వీతముల పై తీర్థమును ప్రోక్షించి , శ్రీ చూర్ణముతో విష్ణు ( బ్రహ్మ ) ముడులను అలంకరించి ఎదుటనుంచుకొని )
1 . ప్రథమ తంతా ఓం అగ్నిమీళేతి ఓంకారమావాహయామి ,
2 . ద్వితీయ తంతౌ ఓం అగిందూత మితి అన్ని అవాహయామి ,
3.తృతీయ తంతా ఓం నమో అస్తు సర్పేభ్యో ఇతి సర్పం అవాహయామి ,
4. చతుర్థ తంతా ఓం సోమోధేను గ్ మితి సోమం అవాహయామి ,
 5.పంచమతంతౌ ఓం ఇదం పితృభ్య ః ఇతి పితృన్ అవాహయామి ,
6 . షష్ణ తంతా ఓం ప్రజాపతేనత్వదితి ప్రజాపతిం అవాహయామి ,
7.సప్తమ తంతౌ ఓం తవవాయవృథ ఇతి వాయుం అవాహయామి ,
8 . అష్టమ తంతౌ ఓం చిత్రందేవానామితి సూర్యం అవాహయామి ,
9.నవమ తంతా ఓం విశ్వేదేవాస ఇతి విశ్వే దేవాన్ ఆవాహయామి .
 1 . ప్రథమగ్రంథా - ఓం బ్రహ్మాదేవానామితి బ్రహ్మణే నమః - బ్రహ్మాణ మావాహయామి . 2 . ద్వితీయగ్రంథా - ఓం ఇదం విష్ణురితి విష్ణవేనమః - విష్ణు మావాహయామి . 3 . తృతీయగ్రంథా - ఓం కద్రుద్రాయమితి రుద్రాయనమః - రుద్రమావాహయామి . ధ్యానమ్ -
శ్లో . ముక్తా విద్రుమ హేమనీలధవళ చ్ఛాయై ర్ముఖైసీక్షణిః
     యుక్తాం ఇన్దునిబద్ధరత్నమకుటాం తత్యార్థ వర్ణాత్మికామ్
     గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
      శంఖం చక్రమథారవిందయుగళం హస్తి : వహంతీం భజే

యజ్ఞోప వీత దేవతాభ్యోన్నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి , పాదయోః పాద్యం సమర్పయామి , ముఖే ఆచమనీయం సమర్పయామి . శుద్దోదక స్నానం సమర్పయామి . ( అని తీర్ధనును ప్రోక్షించవలయును) ధూపమాఘ్రాపయామి , దీపం దర్శయామి , నైవేద్యం సమర్పయామి . ఇతి సూర్యాయ ప్రదర్శ . పూర్వవన్నిధాయ యజ్ఞోప వీతం స్పశన్ , అష్ణోత్తర శతసంఖ్యాకాం గాయత్రీ . మంత్రజపం కరిష్యే (శర్కర లేక ఫలమును ఆరగింపు చేయలయును  ) ఆచమ్య ( ఆచ మనము చేసి ) , ప్రాణానాయమ్య ( ప్రాణాయామము చేసి), (సంకల్పము చెప్పి) యజ్ఞోప వీత మంత్రస్య బ్రహ్మా ఋషిః , త్రిష్టుప్ ఛందః , వేదాః త్రయోదేవతాః శ్రీమన్నారాయణ ప్రీత్యర్దే యజ్ఞోపవీత ధారణే వినియోగః

యజ్ఞోపవీతం , పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్
ఆయుష్య మగ్య్రం ప్రతిముంచ శుభ్రమ్ యజ్ఞోపవీతం బలమస్తుతేజః

 ( అను మంత్రమును ఉచ్చరిస్తూ ఒక యజ్ఞోప వీతము బ్రహ్మముడి యొక్క కొన లు పైకి యుండునట్లు ధరించవలయును . తిరిగి ఆచమనము , ప్రాణాయామము చేసి ) గృహస్థాశ్రమ యోగ్యతా సిద్ద్యర్థం ద్వితీయయజ్ఞోపవీత ధారణం కరిష్యే ః ( అని నీళ్ళు వదలి , మరల ’ యజ్ఞోపవీతం . . . బలమస్తు తేజః ’ అనుదానిని పఠించి రెండవ దానిని ధరించవలయును . మరల ఆచమనము , ప్రాణాయామము చేసి )
‘ఉత్తరీయార్థం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
( అని నీళ్ళువదలి  యజ్ఞోపవీత . . . బలమస్తు తేజ ః అను దానిని పఠించి తృతీయ యజ్ఞోపవీతముల ముడులను 108 , లేక 11 పర్యాయములకు తక్కువ కా కుండా గాయత్రీ మంత్రజపమును చేయవలయును . తదుపరి యధాప్రకారము సంధ్యావందనం పూర్తిగావించి ఈ క్రింది మంత్రమును చదువుచు పాత యజ్ఞోపవీతమును శిరస్సు పైనుండి వెనుకకు వీపువైపునకు తీసి తీర్థం వదలవలయును . )
        ఉపవీతం భిన్నతంతుం జీర్ణం కశ్మల దూషితమ్
        విసృజామి హరే విష్ణో , వర్చోదీర్ఘాయురస్తుమే
                 ‘ ఓం తత్సత్ శ్రీమన్నారాయణార్పణమస్తు
                                    జైశ్రీమన్నారాయణ