Monday, 24 October 2022
వ్యక్తి వికాసానికి విద్య
Tuesday, 2 March 2021
అక్షర ఉచ్చారణ దోష ఫలం
అక్షర ఉచ్చారణ దోష ఫలం
శ్లోకం:- అవాక్షర మనాయుష్యం
నిస్వరం వ్యాధి పీడనం
అక్షరం శస్త్ర రూపేణ
వజ్రం పతతిమస్తకే
(పాణినీయ శిక్ష)
అర్థం:-
ఎవరైతే మంత్రాన్ని అక్షర దోషాలతోగాని, అపస్వరముతో గాని చదువుతారో వారిని ఆ అక్షరమే ఆయుధమై ఆయుష్షు క్షీణించి, వ్యాధి రూపంలో పీడించి, జ్ఞాపకశక్తిని పూర్తిగా నశింపచేస్తుంది అని మనకు ’పాణినీయ శిక్ష’ లో చెప్పబడింది. అందుకే మంత్రాన్ని గురు ముఖంగా నేర్చుకోవాలి, వల్లించాలి.
Friday, 18 December 2020
కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన
కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన
భగవత్ భాగవత కటాక్షాలతో జ్యోతిష శాస్త్ర పరిధిలో కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన అనే అంశంపై ప్రశ్నలు - సమాధానాలు రూపంలో మా శక్తి మేరకు మన పెద్దలు మనకి అనుగ్రహించిన విషయాలని కాస్త మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆస్థాన పంచాంగ సిద్ధాంతి, సుప్రసిద్ధ పంచాంగ కర్త, దైవజ్ఞ శిఖామణి, జ్యోతిష రత్న, శ్రీ ఉ.వే.శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం.
ప్రశ్న:- ఈ కరోనా (కోవిడ్-౧౯) వైరస్ పుట్టుకకు కారణమేమిటి?
వందే పద్మావతీం దేవీం మహిషీం వేంకటేశితుః
కృపయాస్మాన్ సముద్ధర్తుం కృతావతరణాం భువి
శ్రీవాత్స శ్రీనివాసార్యః శోణుం గోవింద దేశికం
సంప్రాప్తోభయ వేదాంత సారం సద్గురుమాశ్రయే
ప్రియ భగవత్ బంధువులందరకూ జై శ్రీమన్నారాయణ. యాజ్ఞికపీఠమ్ నుంచి శ్రీమాన్ కిశోరస్వామి వారి ప్రార్ధన మేరకి పెద్దలు అనుగ్రహించిన విషయాలను మనం చర్చించుకుంటున్నాం.
సమా:- ఈ శార్వరి నామ సంవత్సరంలో పెద్ద ఉపద్రవం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది వికారి నామ సంవత్సరంలో ఏర్పడింది. వికారి నామ సంవత్సరంలో ఆరంభమైన ఈ సన్నివేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? అని మనం ఒకసారి చూసినట్లయితే...
యదా జీవయుతో మందో జీవాద్వా సప్తమే స్ధితః
తదా ప్రజా వినశ్యంతి... అన్నట్లు
బృహస్పతి శనితో కలిసి ఉన్నా, శని నుండి సప్తమంలో ఉన్నా ప్రజా నాశనం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడతాయి అని ప్రమాణం. అక్టోబర్ ౨౦ ౨౦౧౯ బృహస్పతి శనితో కలవడం. శని గురు కేతు గ్రహాలు ఎప్పుడు ఒకే రాశిలో ఉన్నా యుద్ధాలు, దుర్భిక్షాలు, అంటువ్యాధులు కలుగుతూంటాయి. అదే మిధున కన్య ధనుస్సు మీన రాశులలో అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది. అయితే అదే ధనుస్సులో మూడు గ్రహాల కలయిక జరిగింది. అది సూర్యుడు తులా రాశి నుండీ మకర రాశిలోకి ప్రవేశించే కాలం. ఆ సమయంలో వైరస్ ఏర్పడింది. లేదా పుట్టింది.
ప్రశ్న:- ఈ వైరస్ తీవ్రత, ఎక్కడ ఎలా ఆరంభమైంది?
సమా:- ఈశాన్య దేశేషు అనే ప్రమాణంతో ఈశాన్య ప్రాంతంలో ప్రారంభం అవుతుంది అనీ, ఆ ప్రాంతంలోనే చైనా ఉంది అని మనకు తెలుస్తోంది. చైనాలోనే ఈ వ్యాధి ప్రారంభమైనా ఆ దేశం అప్పుడే బయట పెట్టలేదని అమెరికన్ రిపోర్ట్ చెబుతోంది కానీ...
రవి రాహు మహీపుత్రాః శశి శుక్ర శనైశ్చరాః
ఏక రాశిం గతాశీతే తదా పృథ్వి భయాకులా
పూర్వదేశే మహా పీడా నృపాణాం సంక్షయో భవేత్
ప్రజా నాశో జాయ భయం తస్క.....న సంశయః
రవి రాహు చంద్ర శుక్ర శని గ్రహములు ఏకరాశి గతులైనప్పుడు భూమండలమందు భయం ఏర్పడుతుంది. తూర్పు దేశాలలో మహాపీడ, నాయకులకు నాశనము, వ్యాధి భయము, ప్రజా నాశనము నిస్సందేహముగా కలుగుతాయని ప్రమాణం. డిసెంబర్ ౨౬న షష్ఠ గ్రహ కూటమి ౬ గ్రహములైన గురు శని కేతు రవి చంద్ర బుధులతో ధనస్సులో ఏర్పడడం జరిగింది. సాధారణంగా షష్ఠ గ్రహ కూటమి ఏర్పడటం జరుగదు. అలా ఏర్పడితే అది ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది అని అర్థం. అదృష్టం కొద్దీ కుజ శుక్రులు అక్కడ లేరు అది కొంత విశేషం. ఈ గ్రహాల కూటమి వల్ల ఏర్పడ్డ వైరస్ క్రమంగా పెరుగుతూ డిసెంబర్ ౩౧న ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడే మహామారి ప్రారంభమైంది. ప్రజా వినాశనానికి బీజం పడిందని అని చెప్పవచ్చు. రాహువు ఆర్ద్రా నక్షత్రంలో మిధున రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు మకరంలో గురువు ధనుస్సులో ఉన్నాడు. ధనుస్సులో ఐదుగ్రహాలు కలవటంతో మరొక ’పంచ గ్రహ కూటమి’ ఏర్పడింది.
జనవరి ౨౩వ తేదీన చంద్ర బుధ శని రవి గ్రహాలు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశించాయి. అప్పుడు గురువు ధనస్సులో ఉన్నాడు. గురు కేతువుల కలయికతో ప్రపంచం అంతా వైరస్ గురించి తెలిసింది. దీనిలో శని సూర్య సూర్యుల కలయిక జరిగింది. శని సూర్య గ్రహాలు వైర గ్రహాలు. వీరి కలయిక మృత్యు ప్రళయ సూచిక. ఇదంతా మకర సంక్రాంతి తరువాత తారాస్థాయికి చేరుకొని ప్రపంచ దేశాలకు పాకడానికి కారణం అయింది. ఇది అత్యంత దుఃఖాన్ని కలగజేస్తోంది.
యదా కర్కస్య సంక్రాంతి రధా మకరస్య సౌ
భవత్కార్యాహి భౌమానం వాణీ దుఃఖ ప్రదామతా
మకర సంక్రాంతి తరువాత ఇది తీవ్రరూపం దాల్చింది. కుజుడు మకరంలో శని గురువులతో కలయిక జరిగింది. అయితే ఫిబ్రవరి ౮న కుజ కేతు గురువుల కలయిక వల్ల ప్రపంచమంతా పెను ప్రమాదంగా మారింది. కనుక కుజ కేతువులతో గురువు కలవటం వల్లే వైరస్ ప్రభావితం అయింది. దానివల్లే ప్రపంచమంతా బీభత్సంగా మారిపోయింది అని స్పష్టమవుతోంది. అలాగే ఫిబ్రవరి ౧౮ నుండి మార్చి ౫ వరకు రాహు కేతువుల మధ్యలో ఇతర గ్రహాలు చేరి కాల సర్పదోషం ఏర్పడింది. ఇంకా కొంచెం పరిశీలన చేసినట్లయితే మండుచున్నటువంటి అగ్నిలో ఆజ్యం వేసినట్లయింది. దాంతో ఈ కాలసర్ప స్థితి ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మానవాళికి ఉపయోగపడే శుభ గ్రహాలకు వాటి ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది. అంటే మంచిని కలిగించే గ్రహములు వాటి శక్తిని కోల్పోవడం వల్ల జనజీవనం స్తంభించడం జరిగింది. అంతే కాకుండా ప్రజలకు మృత్యువు విచిత్రంగా ఉంటుంది. అధికంగా విపత్తులు ఏర్పడతాయి ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉంటుంది అనేది అర్థం అవుతోంది. దాని ప్రకారమే అందరూ అనుభవించారు అనుభవిస్తున్నారు కూడా....
భారతదేశం గురించి విశేషంగా చెప్పాలంటే మనది ఒక గొప్ప దేశం. ముఖ్యంగా ఆధ్యాత్మికత పొందిన దేశం. ఆధ్యాత్మికత ఎక్కువగా మన దేశంలో వుండటం చేత గ్రహ ప్రభావం అంటే, వాస్తవికంగా చెప్పాలంటే ఎప్పుడైతే బృహస్పతి వక్రించడం శని వక్రించడం లాంటివి జరిగాయో వీటివల్ల మనకు ప్రజా నష్టం ఎక్కువుగా జరగకుండా కాపాడింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే కేతువు ధనస్సులో కుజుడు గురువు కేతువులను వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా మారడం వల్ల తగ్గుముఖం పడుతుంది అనేది కనబడుతోంది. దీనివల్ల కొంత ప్రశాంతతను ఇస్తుంది. మార్చి ౨౯, ౩౦ తేదీల్లో కేతువుని గురువు కూడా వదిలి పెట్టడం వల్ల కేతువు ఒంటరి వాడయ్యాడు. దీనితో జనాలలో కొంత అవగాహన పెరగడం, కొద్దికొద్దిగా వైరస్ తగ్గినట్లు అనిపించినా కూడా భయాందోళనలు పూర్తిగా ఇది నిర్మూలన అనేది జరగదు. ఆ తరువాత మనకి ఉగాది నాటి నుండి ఒకసారి గ్రహాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మార్చి ౨౫న ఉగాది ఏర్పడింది. శార్వరి అంటే చీకటి అని మాత్రమే అందరికీ తెలిసింది. కానీ చీకట్లను పారదోలడానికి భగవంతుడు ఎలా వస్తాడో కూడా ఇందులో చెప్పాడు. శార్వరిలో చీకటిమయం కాబోతున్న ఈ సంవత్సరంలో మన దేశం ఆధ్యాత్మికతతో కూడిన దేశం కనుక మనల్ని రక్షించడానికి పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడో ఈ శార్వరిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.
ప్రశ్న:- ఈ సంవత్సరంలో చాతుర్గ్రహ, పంచ గ్రహ, షడ్గ్రహ కూటములు ఎన్ని ఉన్నాయి? వాటి ప్రభావమేమిటి?
సమా:- ఈ శార్వరీ నామ సంవత్సరంలో ౧౦ సార్లు చాతుర్గ్రహ కూటములు, ౪ సార్లు పంచ గ్రహ కూటములు, రెండు సార్లు షట్ గ్రహ కూటములు ఉన్నాయి. కొన్ని ఏర్పడ్డాయి, మరికొన్ని ఏర్పడబోతున్నాయి. వాటివల్ల అనేక రోగపీడలు, పరస్పరము రాజులు కలహించుకోవడం అలాగే వాయుపీడ, దాంతో పాటుగా మంచి వర్షాలు కనిపించినా దాని వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం లాంటివి ఉంటాయి.
ఒకసారి ఆ తేదీలను పరిశీలిద్దాం...
ధనుస్సులో బృహస్పతి ఉంటే...
వీత రోగ భయాస్సర్వే చాపస్ధే దేవ పూజితే
హృదయానందినీ ధాత్రీ పరశాలీ సువృష్టిభిః
సమస్త జనులు రోగం లేక మంచిగా ఉంటారు. వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. మకరంలో బృహస్పతి వచ్చినప్పుడు...
అసత్ప్రభో జనాధాత్రీ పూర్ణ సస్యానువృష్టిభిః
వీత రోగ భయాస్సర్వే మకరస్ధే సురార్చితే
ఇది మరొక ప్రమాణం. సకల జనులు శత్రు రోగ భయ రహితులై ఉంటారు. సువృష్టి చేత భూమి సస్యశ్యామలమై ఉంటుంది. కుంభంలోకి బృహస్పతి వస్తే...
బృహస్పతే కుంభగతే ధరిత్య్రాః కుంభాభిషేకాశ్చ శివాలయేషు
భద్రాసనారోహణ మంగళాప్తిర్మహీ భుజాం శూద్రజనో చ్ఛ్రయస్యాత్
అని శివాలయములో కుంభాభిషేకములు జరుగుతాయి. రాజులు సింహాసనం ఎక్కుతారు. శూద్రులు గొప్ప స్థితికి వస్తారు అని ఒక ప్రమాణం. కానీ ఇక్కడ ఈ సంవత్సరం ముఖ్యంగా బృహస్పతి, శని వక్రించి ఉండటం చేత శని వక్రారంభం అయిన తరువాత అది ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయింది ఈ వైరస్. బృహస్పతి వక్రించినప్పటికీ కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక బలం కలిగి ఉండటం చేత ప్రధానమైన ప్రజా నష్టం పెద్దగా జరగకుండా కాపాడింది. గురువు వక్రించి ధనస్సులో కేతువుతో కలవడంతో జూలై ౧నుండి వ ురింత విజృంభిస్తోంది.
ప్రశ్న:- ఈ కరోనా అంతమయ్యేది ఎప్పుడు?
సమాధానం:- రేపు ౧౩.౯.౨౦౨౦న గురువు త్యాగం అవుతున్నాడు అంటే తదుపరి వ్యాక్సిన్ లాంటి ఔషధం రావచ్చు. అలాగే ౨౯ సెప్టెంబర్ శని వక్ర త్యాగం కనుక ఈ కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతుంది అని తెలుస్తోంది. అలాగే ౧౮ నవంబర్ కేతువు ధనస్సు వీడి వృశ్చికానికి వెెడుతున్నాడు. ఆ వెళ్లడం చేత ఈ కరోనా వ్యాధి దానంతట అదే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. దాని కంటే ముందుగా ఇంకా చూస్తే మనకి రేపు అధిక ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి ౨౪ సెప్టెంబర్ నుండి దీని తగ్గుముఖం పట్టి ఒక ఔషధం కనిపించే అవకాశం విశ్వాసంతో పూర్తిగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంది.
ప్రశ్న:- ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలాంటి వైదిక కర్మలను ఆచరించాలి?
సమాధానం:- కాలచక్రంలో ఉపద్రవములు ఏర్పడ్డప్పుడు అద్భుత శాంతులు చేయటానికి ఒక ప్రక్రియ ఉంది. అది మనకి స్పష్టంగా ఋష్యాదులు లాంటి పెద్దలు మనకు అనుగ్రహించారు. షష్ఠ గ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?
చాతుర్గ్రహ కూటములు బాగా ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?
పంచ గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?
అనేది ఈ ప్రాయశ్చిత్త కాండలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా అనేక ఉపద్రవాలు ఏర్పడ్డప్పుడు, జగత్తుకి సంక్షోభం ఏర్పడ్డప్పుడు అద్భుతశాంతి జరిపినట్టుగా మనకి ఒక ప్రమాణం కూడా కనబడుతోంది.
ప్రశ్న:- మరి దీన్ని గతంలో ఎవరైనా ఎప్పుడైనా ఆచరించారా?
సమాధానం:- భృగువు అనే మహర్షి పూర్వం ఆచరించాడు అని ఉంది. శ్రీ మహావిష్ణువుకి ౨ పాదములు - మూలా నక్షత్రం. ౨ పిక్కలు - రోహిణి నక్షత్రం. ౨ మోకాళ్ళు - అశ్విని నక్షత్రం. ౨ తొడలు - పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు. ౨ పృష్ఠము - పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు. నడుము - కృత్తికా నక్షత్రం. ౨ పార్శ్వాలు - పూర్వాభాద్ర ఉత్తరాభాద్రలు. ఉభయ కుక్షి - రేవతి నక్షత్రము. వక్షస్థలం - అనురాధ. పృష్ఠ ప్రదేశం - ధనిష్ఠ. ౨ భుజములు - విశాఖ. ౨ చేతులు - హస్త. వ్రేళ్ళు - పునర్వసు. గోళ్ళు - ఆశ్రేష. కంఠము - జ్యేష్ఠ. చెవులు - శ్రవణం. ముఖము - పుష్యమి. దంతము - స్వాతి. దవడలు - శతభిష. ముక్కు - మఖ. నేత్రములు - మృగశిర. లలాటమ - చిత్త. శిరస్సు - భరణి. జుట్టు - ఆర్ద్ర. ఇలా శ్రీమహావిష్ణు స్వరూపాన్ని వర్ణించబడిఉంది. దీన్ని నక్షత్ర పురుషము అంటారు. ఈ నక్షత్ర స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపము అనీ, దీన్ని జగత్ సంక్షోభము ఏర్పడినప్పుడు అద్భుత శాంతి ప్రక్రియగా భృగుమహర్షి ఆచరించాడు. అని ఇలాంటి నక్షత్ర స్వరూప శ్రీమహావిష్ణు యాగం ఆచరిస్తే సర్వపాతకములు నశిస్తాయి. సప్త జన్మలలో జరిగిన పాతకములూ నశిస్తాయి. కుల సాంకర్యం వలన వచ్చింది కానీ, లేదా తల్లిదండ్రుల వలన వచ్చినదైనప్పటికీ కూడా దాన్ని ఉపశమింపచేస్తుంది. దీని వలన చక్కని రూపం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. ఉత్తమమైన శరీర ఆరోగ్యం కలుగుతుంది. అంతులేని మనస్సంతృప్తి కలుగుతుంది. చక్కని వాక్ మాధుర్యం కలుగుతుంది. కాంతి ఏర్పడుతుంది. ఉత్తమమైన జాతి ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైనది. ధన్యమైనది. శ్రేయోదాయకమైనది.
Monday, 23 March 2020
అన్న ప్రాశనము
అన్న ప్రాశనము
బాలకునకు 6, 8, 10, 12, సరిమాసములందును, బాలికకు 5, 7, 9, 1 బేసిమాసములందుసు అన్న ప్రాశనము చేయవలెను.ధువ, మృదు, లఘు, చర. నక్షత్రములు ప్రశస్తములు,
రిక్త ( 4, 9, 14 ) నంద ( 1, 6, 11 ) తిధులును, అష్టమి, అమావాస్య, ద్వాదశి, తిధులును, ఆన్న ప్రాశనమునకు పనికిరావు.
ఆది, శని, మంగళవారములందు అన్నప్రాశనము చేయగూడదు.
జన్మరాశి, జన్మలగ్నమునకు అష్టమలగ్నము లేక అష్టమ నవాంశ లగ్నము. మీన, మేష, వృశ్చిక లగ్నములు అన్న పాశనమునకు యోగ్యములుకాపు
లగ్నమునకు కేంద్ర త్రికోణ స్థానములందు శుభ గ్రహములును, తృతీయ. షష , లాభములందు పాపగ్రహములును, అన్నప్రాశనమునకు శుభపదములు, దశమశుద్ది వుండవలెను. అనగా దమస్థానమునందు గ్రహములుండకూడదు. షష్ఠాష్టమములో లగ్నంలో చంద్రుడు వుండకూడదు. సష్టమములందును లగ్నమునందును, చందుడుండరాదు. అనూరాధ, శతభిషము, పాతి, జన్మ నక్షత్రములు అన్నప్రాశనమునకు యోగ్యములుగా వని కొందరి అభిమతము
లగ్నమునకు 5. 9. 12. 1, 4, 7, 10, 8 స్థానములందు క్షీణచందుడున్న యెడల భిక్షాశియు, పూర్ణచందుడుండిన యజ్ఞకర్తయు, గురుడుండిన ధీర్ఘాయుష్యము గలవాడును, బుధుడుండిన జ్ఞానియు, కుజుడుండినయెడల పైత్యరోగియు, సూర్యుడుండిన కుష్టురోగియు, శనియుండిన క్లేశవంతుడును, వాతరోగియు. శుకుడున్నయెడల భోగవంతుడును అగుసు. నారద వచనానుసారము శుక్ల పక్షపూర్వాపము అన్నప్రాశనమునకు ప్రశస్తము
మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి అశ్వని , రోహిణి , మృగశిర , పునర్వసు , పుష్యమి , ఉత్తర , హస్త, చిత్త , స్వాతి , అనూరాధ , ఉత్తరాషాడం , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , ఉత్తాభాద్ర , రేవతి నక్షత్రములయందు చేయవలెను . ఆది , శని , మంగళవారములు నిషేధం . జన్మలగ్నం , అష్టమ లగ్నం కాకుండగను , దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను
నారదోక్త్యనుసారము జన్మనక్షతమునకు శుభసదమని తెలియుచున్నది. అయితే జ్యోతిర్వివరణమందు జన్మనక్షత్రమునందు ఆన్నపాశనము చేసినయెడల శ్రీక్షయమును. దశమ నక్షత్రమందు అతిసౌఖ్యమును, ఆధాననక్షత్రమునందు రోగ నాశనము గలుగునని చెప్పబడినది.
భరణి, కృత్తిక, ఆశ్రేష, మఖ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద, జ్యష్ఠ, మూల, నక్షత్రములు అన్న పాయనమునకు నింద్యములు, అనగా విడువవలెను
Wednesday, 22 January 2020
ఏల్నాటి శని
ఓం శం శనయే నమః
జ్యోతిష్య శాస్త్ర రీత్య శనికి నవగ్రహలలోప్రత్యేక స్థానం వుంది.
శని అనగానే... ఏల్నాటి శని (సాడే సాత్) మరియు, శని దశ.
శని పుట్టుక, ప్రవర్తన, ప్రభావము ముందుగా తెలుసుకుందాం. శని నపుంసక గ్రహం, వాయుతత్వ గ్రహం, నల్లని దేహం, మందబుద్ధి గలవాడు. పెద్ద దంతములు, వితారంగ బిరుసైన రోమములతో ఉండును. చాయాదేవి, సూర్యుల సంతానమే శని, సూర్యునకు పడమర వైపున దనుస్సు ఆకారపు మండలంలో నివసించును. కాస్యప గోత్రస్తుడు, సౌరాష్ట్ర దేశాదిపతి.
శనిని మందగమనుడని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రరిత్యా శని మకర మరియు కుంభ రాశులకు, పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాంలకు అధిపతి, మిధున, కన్య మరియు వృషభ రాశులు మిత్ర క్షేత్రములు కర్కాటక, సింహరాశులు శత్రు స్థానములు, శని మిత్ర గృహాలు, శుక్ర, రాహు మరియు బుద శత్రుగృహాలు, రవి, చంద్రులు, గురు సమానభావంతో ఉండును. గోచారరిత్యా జన్మరాశికి శని 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలు మంచివి గావని చెప్పుదురు. గాని ముఖ్యంగా జన్మరాశికి 12, 1, 2 స్థానాలలో శని సంచారం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు, విషమ పరిస్థితులుంటాయి. ఈ సమయాన్నే ఏల్నాటి శని అందురు. ఏల్నాటి శని 7సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. శని 12 రాశులు చుట్టి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శని ఒకోక్క రాశిలో 2 సం 6 నెలలు సంచరిస్తుంది. అలా చంద్రరాశికి ముందు (12వ స్థానం), జన్మరాశి తరువాతి స్థానం (2 స్థానం) లో శని సంచారానికి 7సం వ 6 నెలలు పడుతుంది.
మన జీవితంలో ఎలాటి శని రెండు నుంచి మూడు మార్లు వస్తుంది. మొదటి 2సం 6 నెలలు 12వ స్థానంలో ఉన్నప్పుడు చెడు ప్రభావం చూపును, అప్పుడప్పుడే మానసిక ఆందోళన ప్రారంభం అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నశించి ఇబ్బందులు ప్రారంభంఅవుతాయి. జన్మరాశి ( 1వ స్థానం ) లో ఉన్నప్పుడు ఆకారణకలహాలు, ఆస్థినష్టం, కుటుంబంలో మరణం, అనారోగం కలుగవచ్చు. 2వ స్థానం ( చివరి 2 సం 6 నెలలు ) నిరాశ నిస్పృహలు, అపవాదులు, కొన్ని సమయాలలో ఆత్మహత్యకు ప్రేరణవంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. మొదటి రెండున్నర సంవత్సరాలు శిరస్సు వని అని, మద్య రెండున్నర సంవత్సరములు జన్మ శని అని, చివరి రెండున్నర సంవత్సరములు పాద శని అంటారు
బాల్యంలో ఏల్నాటి వస్తే’ మంగు శని’ అని యవ్వనంలో వస్తే ’ పొంగు శని అని, వృద్ధాప్యంలో మారక శని అని వ్వవహరిస్తారు. ఇదియు గాక చంద్రరాశి నుండి 8వ స్థానంలోకి శని ప్రవేషించినచో అష్టమశని అని, నాలగవ స్థానంలోకి శని ప్రవేశిస్తే అర్ధాష్టమ శని అని అంటారు. శని 3, 6, 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది.
ఏల్నాటి శని సమయంను ఏడు భాగాలుగా విభజించి ఫలితాలు పరిశీలించినట్లయితే...
మొదటి 3 నెలలు 10 రోజులు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు
ఆ తరువాత 13 నెలలు ఉద్యోగ లాభం.
ఆ తరువాత 1 సం 8నెలలు 10 రోజులు మానసిక ఆందోళన, అవమానం.
1 సం 4 నెలలు 20 రోజులు ఆర్థికంగా కోలుకోవచ్చు.
1 సం 1 నెల 10 రోజులు అనారోగ్యం, సమయానికి డబ్బు చేతికి రాకపోవచ్చు.
10 నెలలు సంతోషం.
చివరి 6 నెలలు 20 రోజులు ఆర్థిక సమస్యలతో పాటు ప్రమాదాలు జరిగే అవకశాలు ఎక్కువ.
జీవితంలో ప్రభావం చూపే అంశాల ముఖ్యంగా ఆయుష్యు, మరణం, సేవకులు, బందికాన, ప్రవాసం, నీచ విద్య, దుఖం, అధర్మం, అనాచారము, కార్యభంగము, వ్యసనం, అతి త్రాగడు, కళ్ళలో అనారోగ్య లక్షణాలు, కుటుంబ తగాదాలతో మానసికంగా కృంగిపోవడం.
అయితే జాతక రిత్యా ఎవరైతే పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించినవారు, శని మకర లేక కుంభ రాశులలో ఉన్నవారు మరియు మకరం లేక కుంభ లగాలలో జన్మించిన వారికి శని ప్రభావం అంతగ ఉండకపోవచ్చు.
ఇక్కడ మరోవిషయం చెప్పుకోవాలి జాతకం ప్రకారం శని మహాదశ నడుస్తున్న వారికి ( శని మహాదశ 19 సం లు ) ఏల్నాటి శని గూడ తోడైనట్లయితే, దీనికి తోడు శని మహాదశ, శని అంతర్థగా ఉండే ఏల్నాటి శని వచ్చినట్లయితే వారి బాధలు వర్ణణాతీతం. అతిగా బాధలు పడవలసి రావచ్చును.
ఏల్నాటి శనికి శాంతి ప్రక్రియలు ముఖ్యంగా శనికి ప్రీతికరమైన పనులు చేయడం. సత్యమే పలుకడం, అబద్ధం ఆడకుండా ఉండటం, శనికిి ఇష్టం అయిన వస్తువులను దానం చేయడం లాంటివి చేయాలి.
దీనితో కొంత ఉపశమనం కలిగించినా, మంత్ర పఠనం చేయాలి. ఇందుకు సరైన గురువును ఆశ్రయించాలి.
ప్రతిరోజు దిగువ ఉదహరించిన ప్రార్థన నిర్ణీత సంఖ్యలో పఠించాలి.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్
కాకులకు బెల్లంతో కలిపిన నల్ల నువ్వులు పెట్టగలరు మంచి స్వచ్చమైన నీలంను వెండితో చేయించి కుడి చేతి మధ్య వ్రేలికి ధరించి కేజింబావు నల్ల నువ్వులు దానం ఇయ్యాలి.
నవగ్రహాలలోని శని గ్రహమునకు నువ్వుల నూనెతో శని త్రయోదశమి రోజున లేక శనివారం రోజున తైలాభిషేకం చేయించాలి.
వీలు కాని వారు మాత్రం ప్రతిరోజు ప్రాతః కాల సమయంలో శని రహస్య స్తోత్రము పఠించాలి.
నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బద్రురూపాయ కృష్ణాచయ నమోస్తుతే
నమస్తే రౌద్ర దేహాయ నమస్తే శాంత కాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో
నమస్తే యమ సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమ దేవేశ దీపస్య పుణతస్యచ
ప్రతి శనివారం ఉదయం తల స్నానం చేసి నల్లని వస్త్రం ధరించి నెయ్యి, ఆముదం, నువ్వుల నూనెల మిశ్రమంతో గూడిన ఇనుప గరిటలో ఎఱువు నలుపు, తెలుపు కలిపి వత్తులు వేసి గదిలో పడమట దిక్కులో శని దీపం ఉంచినచో శని శాంతి జరిగి శని వేదన ఉండదని ప్రతీతి.
Saturday, 28 December 2019
ధనుర్మాసం
ఆండాళ్ ఆరాధన
ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం మన సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
ఆండాళ్ తల్లి ఆరాధన, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని అంటారు. ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆండాళ్ తల్లి అనుగ్రహం కలుగుతుందని విస్వాసం. వేదమనైతుక్కుంవిత్తాగుం అంటారు తిరుప్పావై అంటే వేదమంతటికి మూల బీజము . ఈ తిరుప్పావైలోని ముపై పాశురాలు నాలుగు వేదాలలోని సారము. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. అమ్మకటాక్షం కలిగితేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భూదేవియే శ్రీ ఆండాళ్తల్లిగా అవతరించి తిరుప్పావై మన కందించింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం.
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో గోదాదేవి స్వామిని కీర్తించేది. మనలో ఎన్ని దోషాలున్నప్పటికి వాటిని తొలగించిపరమాత్మను చేరుకోవడానికి ధనుర్మాస అనుగ్రహిస్తున్నాడు.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయి. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాస వ్రతంతో ఆతల్లి మనందరిలో ప్రేమను నింపి ఆ ప్రేమ పాశముచేతభగవంతునిచే బంధించే ఉపాయాన్ని అనుగ్రహించింది. మాసానాం మార్గశీర్షం అని చెప్పుకున్న పుణ్యకాలము భగవత్ ప్రాప్తి కొరకు శరణాగతిని ఉద్బోదించే పరమ పవిత్రకాలము ఈ ధనుర్మాసము.
-
*యాజ్ఞికదర్శిని అంతర్జాల పత్రికలో ప్రచురించిన వ్యాసం*
Thursday, 19 December 2019
సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం
సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం
డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఆరుగ్రహాల కలయిక ధనుస్సు రాశిలో జరుగుతున్నప్పుడు గ్రహణం సంభవిచడం దుష్ప్రభావాలకు దారితీస్తోంది.లోక కల్యాణమునకు 97,98 శ్లోకాలు పఠించాలి
సూర్యగ్రహణం - ఆయా రాశులపై ప్రభావం
గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తున్నది. 5వస్థానాన్ని పంచమ స్థానం అంటారు. బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతకు సంభందించిన విషయాలలో ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలే ఎక్కువ. ఫై విషయాలలో జాగ్రత్త అవసరం.
కన్య రాశి:-
గ్రహణం 12వ స్థానంలో సంభవిస్తున్నది. 12వ స్థానం ఖర్చులకు, విదేశీ యానానికి, ఆరోగ్య సమస్యలకు సంబంధించినది. తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
గ్రహణం 10వ స్థానంలో సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి, పేరు ప్రతిష్టలకు సంబంధించినది. వ్యతిరేక ఫలితాలకు ఆస్కారం.