వాయవ్యం వీధిపోటు
ఉత్తర - పశ్చిమ దిశల మధ్య ఉన్న ప్రదేశాన్నే వాయవ్యంగా పరిగణిస్తారు. పశ్చిమ వాయవ్యం శుభాలను కలిగిస్తే, ఉత్తర వాయవ్యం అశుభాలను కలిగిస్తుంది పశ్చిమ వాయవ్యం లాభాలను చేకూరుస్తూ ఇంటి యజమాని నాయకత్వానికి అండగా నిలుస్తుంది. ఆ ఇంట అన్నీ సానుకూల ఫలితాలే . కలుగుతాయి. ఆ ఇంటి యజమానికి అన్నిశుభలే. కీర్తిని, ధనాన్ని ఆర్జిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరి ఆమోదాన్ని పొంది రాజకీయాల్లో రాణింపును పొందుతారు.ఉత్తర వాయవ్యం వీధిపోటు గృహ యజమానులను వెదుక్కుంటూ సమస్యలు .ఆ కుటుంబంలో ఉన్న యుక్తవయస్కులకు పెళ్లి కుదరకపోవటం, కుదిరినా ఆటంకాలు కలుగుతాయి . అంతేకాకుండా ఇంటిలో నివసిస్తున్న మహిళలు అనైతిక విషయాల పట్ల ఆకర్షితులు అవుతారు. జాతకాలు కూడా తోడయితే ఇక ఇబ్బందుల తీరు చెప్పనక్కరలేదు. సమస్యలతో జీవితాన్ని గడపాల్సివస్తుంది.