నైరుతి వీధి పోటు
దక్షిణ - పశ్చిమ దిశలో ఉండే ప్రదేశం కొంత భాగం నైరుతి క్రిందకు వస్తుంది. ఈరెండు వైపులా వీధి ఎదురుగా ఉంటే అది నైరుతి వీధి పోటు అంటారు . దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న గృహాలలో నివశించే మహిళలఫై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.. సిరులకు, మహిళలకు ఇది చేటు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు గృహం ఆలవాలం అవుతుంది. ప్రతి అశుభాలకే దారి తీస్తుంది. దంపతుల మధ్య కలహాలు, ఆ ఇంట ఉండే స్త్రీలకు ఎప్పుడూ ఏదో ఒకరకమైన అనారోగ్యం ఉంటుంది . చిన్న పనితలపెట్టినా అవాంతరాలు ఎదురవుతాయి.పశ్చిమ నైరుతిని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తి కలిగించే అంశాలు తేటతెల్లం అవుతాయి. పశ్చిమ నైరుతి పురుషులపై దుష్ప్రా భావం కలిగిస్తుంది ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనం మాత్రం ఉండదు.
No comments:
Post a Comment