ఆగ్నేయం వీధి పోటు
తూర్పు ఆగ్నేయం వీధి పోటు అశుభం. దక్షిణ ఆగ్నేయం వీధి పోటు శుభం. మరికొన్ని సందర్భాలలో ముందుకు వెనుకకు జరిగి ఇంటి నిర్మాణాలను చేయడం వల్ల కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. ఆగ్నేయం అంటే అనర్దాలకు హేతువనే బలమైన వాదన కూడా ఉంది.ఐతే దక్షిణ ఆగ్నేయం వీధి పోటు ఉన్న గృహంలో నివసించే కుటుంబం తృప్తికరంగా, సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు . వీరు బంధువులను చక్కగా ఆదరిస్తారు. ఈ ఇంట తలపెట్టిన ఏ శుభకార్యమైనా
నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంటికి తూర్పు వైపున ఉన్న ఆగ్నేయ వీధి పోటు అనేక
సమస్యలు మానసిక అశాంతికి హేతువు అవుతుంది , ఆదాయానికి మించిన ఖర్చులు, కుటుంబ
సభ్యుల మధ్య తరచూ తగాదాలు జరుగుతుంటాయి. వీటివల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.ఇలా కొన్ని వీధి పోట్లు మంచివి కాగా మరికొన్ని చేడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. ఏది ఏమైనా వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణుల సలహాలు తప్పనిసరి.
No comments:
Post a Comment