ఈశాన్య వీధిపోటు
వీధిపోటు అంటే ఏమిటి? ప్రచారంలో
చెబుతున్నట్టు వీధిపోటుతో మంచి - చెడూ జరిగే అవకాశము ఉందా? వాస్తుశాస్త్రం
ప్రకారం ఇంటికి ఎదురుగా నిలువుగా ఉన్నవీధి ఇంటివరకూ వచ్చి
ఆగిపోయినా, లేదా ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటు అంటారు. వీధిపోటు అనే
అపోహల మూలంగా నిరంతరం
మానసిక అశాంతికి గురవుతున్నవారు లేకపోలేదు. తూర్పు వీధిపోటు విషయానికి
వస్తే తూర్పు ఈశాన్యం , తూర్పు ఆగ్నేయం రెండు దిశలు కనిపిస్తాయి. ఇందులో
ఈశాన్యం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈశాన్య వీధిపోటు మంచి ఫలితానిస్తుంది.
ఈశాన్య వీధిపోటు ఉన్న ఇంటిలోని పురుషులకు ఇంటా బయటా గౌరవం లభిస్తుంది.
ఉన్నత అధికారాన్ని పొందుతారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయ అవకాశాలు వేదుకుంటు వస్తాయి. తూర్పుతో
పాటు ఉత్తరం ఈశాన్య వీధిపోటు కూడా మంచిదే. ఇలాంటి ఇంటిలో
స్త్రీలు కూడా అన్నివిధాలా ఉత్తమ ఫలితాలు పొందుతారు. చీకూ చింతా
లేకుండా జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహాన్ని
పొందుతారు.
No comments:
Post a Comment