My site provides Vastu and Jathakam ....

Thursday, 7 September 2017

 వాస్తు ప్రభావము వల్ల  జాతకాలు కలిసి వస్తాయా?

వాస్తు ప్రభావము వల్ల  జాతకాలు కలిసి వస్తాయా? వీధిపోట్లు, ప్రధానగుమ్మం ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది.  ఇంటీలో ఉండే గదులు, నడక ఎంతవరకు కలసి వస్తాయి, ఇలాంటి సందేహాలు కలుగడం సహజం.
కట్టిన ఇల్లు తీసుకున్నా, స్థలం కొని ఇల్లు కట్టుకున్నా సాంకేతిక  సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో నివారణోపాయాలు వెదుక్కోవడఁ తప్పనిసరి. ఇందుకోసం ముందుగా ఇంటి దిశలు అంటే దిక్కులు, వాటి అధిష్టాన దేవతల పనితీరు
అధ్యయనఁ చేయాలి.
ఈశాన్యం - ఈశ్వరుడు,
తూర్పు - ఇంద్రుడు ,
ఆగ్నేయము - అగ్ని,
దక్షిణము - యముడు
నైరుతి - పిత్రు (నీరుత్యా)
పడమర - వరుణుడు
వాయువ్యము - వాయువు
ఉత్తరము - కుబేరుడు
కేంద్రము - బ్రహ్మ
ఇంతేకాకుండా పంచభూతాలకు వాస్తు ప్రత్యక్షముగా పరోక్షంగా ప్రాముఖ్యతను ఇస్తుంది,
పంచభూతాలంటే ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు వీటికి ప్రాధాన్యతను ఇస్తూ ఇంటి నిర్మాణము, మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment