My site provides Vastu and Jathakam ....

Thursday, 19 December 2019

సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం

 సూర్యగ్రహణం -  షష్ఠగ్రహకూటమి ప్రభావం

డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది.  ఆరుగ్రహాల కలయిక ధనుస్సు రాశిలో జరుగుతున్నప్పుడు గ్రహణం సంభవిచడం దుష్ప్రభావాలకు దారితీస్తోంది.  
 సూర్యగ్రహణం ప్రభావం మనపైన పడకుండా ఉండటానికి జాగత్త పడితే వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణముతో సత్ ఫలితాలు సాధ్యం.

లోక కల్యాణమునకు 97,98 శ్లోకాలు పఠించాలి

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹
విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹
  

సూర్యగ్రహణం - ఆయా రాశులపై  ప్రభావం

 మేష రాశి:-
 గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది ఇది మిశ్రమ ఫలితాలకు దారితీస్తుంది. . తొమ్మిదో స్థానం భాగ్య స్థానంలో గ్రహణ స్థితి వలన ఈ రాశివారికి కొంత తార్కిక వాదన  ఖండించే మనస్తత్వం ఏర్పడటం జరిగే అవకాశం ఉంది. 
 వృషభ రాశి:-
గ్రహణం 8వ స్థానంలో సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది. సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు. పెట్టుబడుల విషయంలో  జాగ్రత్త!
మిధున రాశి:-
 గ్రహణం 7వ  స్థానంలో సంభవిస్తున్నది. సప్తమ స్థానం వైవాహిక జీవితానికి వ్యాపారానికి సంబంధించినది. 
 వైవాహిక జీవితంలో,  వ్యాపార భాగస్వామ్యాల విషయంలో పట్టుదల తగదు. 
కర్కాటక రాశి:-
గ్రహణం 6వ  స్థానంలో సంభవిస్తుంది. 6వ  స్థానం అనుకూల స్థానం. వృత్తిలోఅనుకూల ఫలితాలు.  కోర్టు కేసులు,  వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
సింహ రాశి:-
 గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తున్నది. 5వస్థానాన్ని పంచమ స్థానం అంటారు.  బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతకు సంభందించిన విషయాలలో ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలే ఎక్కువ. ఫై విషయాలలో జాగ్రత్త అవసరం.  
కన్య రాశి:-
 గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది. 4వ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు సంబంధించినది. ఇక్కడ కూడా వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలు ఉన్నాయి.  ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. 
తులా రాశి:- 
గ్రహణం మూడవ స్థానంలో సంభవిస్తుంది. 3వ స్థానం అనుకూల స్థానం.   చేపట్టిన పనుల్లో విజయం సాధించే
అవకాశాలు ఉన్నాయి. 
వృశ్చిక రాశి:- 
 గ్రహణం 2వ స్థానంలో సంభవిస్తున్నది.2వ  స్థానం ధనానికి, కుటుంబానికి,  మాటకు సంభందించినది. జాగ్రత్త అవసరం. వాదప్రతివాదాలు తగదు
.ధనస్సు రాశి:- 
 గ్రహణం 1వ స్థానంలో సంభవిస్తున్నది.  ఇది అనుకూల  స్థానంకాదు.  తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మకర రాశి:- 
 గ్రహణం 12వ స్థానంలో సంభవిస్తున్నది. 12వ  స్థానం ఖర్చులకు,  విదేశీ యానానికి,  ఆరోగ్య సమస్యలకు సంబంధించినది. తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. 
కుంభ రాశి:- 
గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం. అనుకూల స్థానం.  అన్ని శుభఫలితాలే. 
మీన రాశి:-
గ్రహణం 10వ స్థానంలో సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి,  పేరు ప్రతిష్టలకు సంబంధించినది.  వ్యతిరేక ఫలితాలకు ఆస్కారం. 

షష్ఠగ్రహకూటమి

ధనస్సురాశిలో షష్ఠగ్రహకూటమి సంభవించనుంది. ఇదే సమయంలో గ్రహణ సంభవం యదృర్శిచికం .గ్రహణం సంభవిచే ప్రాంతాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా షష్ఠగ్రహకూటమి ప్రభావం ఉంటుంది.
ధనస్సురాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్న ఆరు గ్రహాలు గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు . 2019 డిసెంబర్ 25, 26, 27 తేదీలలో  షష్ఠగ్రహకూటమి సంభవించనుంది
2019 డిసెంబర్ 28 నుంచి 2020 జనవరి 1 వరకూ గురు, శని, కేతు, సూర్య,  బుధులు అయిదు గ్రహాలు కలసి ధనస్సురాశిలో ఉంటాయి. ఈ 15 రోజుల ఫలితాలు విశ్లేషిస్తే ఆలోచించే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. 
గ్రహకూటమి ప్రయాణాన్ని గమనిస్తే తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి వెళ్లగా, మిగిలిన నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. 
ఇక్కడ గురు - శనుల పాత్ర ముఖ్యమైనది. ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో గురు - శనులు కలుస్తారు.
గురు - శనులు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  మార్పులు తధ్యం. గతంలో జరిగాయి. ఎందుకంటే గురు, శని గ్రహాల గమనంతోనే  జాతకంలో మార్పులు జరుగుతాయి.  ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనస్సు రాశి తోపాటు, ధనస్సుకు ఎదురుగా ఉండే మిధునరాశికి కూడా సమాన ఫలితాలు ఉంటాయి. రాశులకు సంభంధించిన దేశాలలో కూడా మార్పులు, నష్టం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి ధనస్సు రాశి ద్వాదశ ఫలితం ఉంటుండి, అదేవిధంగా అమెరికాను సూచించే మిధునరాశి ధనస్సుకు ఎదురుగాఉండటాన్ని గమనించి జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు.

2 comments:

  1. Bagundi visleshana mariyu mundu jagatta

    ReplyDelete
  2. పేరు వివరాలు ఇస్తేబాగుండేది.
    Thaks for comment

    ReplyDelete