My site provides Vastu and Jathakam ....

Monday, 6 April 2026

గ్రహమాలిక అంటే ఏమిటి? ఎవరికి లాభం? లాభం పొందే రాశులు

 గ్రహగమనాలు మానవుల జీవితంపై ప్రభావాలు చూపుతున్నాయన్నది వాస్తవం. కొన్ని మార్లు ప్రయోజనాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. గ్రహమాలిక గురించిన విషయాలు చాలావరకు పరిగణనన తీసుకున్న సందర్భాలు తక్కువ. జన్మకాల దశలో మాత్రమే ఈ ప్రభావం ఎక్కువ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. జన్మకాల దశ అనంతరం ఈ ఫలాలు వారివారి నక్షత్రాలు స్థానాలను అనుసరించి ఉంటాయి. గ్రహమాలిక గురించి తన రచనలలో వరాహమిహురుడు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ bందుకు అని అనిపించవచ్చు. ఈ నెల పూర్ణిమ తరువాత పాడ్యమి నాటి నుండి కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కుంభం, మీనం,  మేషములలో రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల గ్రహమాలికా స్థితి కనిపిస్తుంది. ఇదే వరుసలో మిధునం కర్కాటకంలలో వరుణ, గురు గ్రహాలు కూడా ఉన్నాయి. ఆధునికులు వరుణ ఇంద్ర యమ గ్రహ ప్రస్తావన కూడా అప్పుడప్పుడు తమ గణన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వరుణ (యురెనస్) మిధునంలో, గురువు కర్కాటకంలో సంచారం చేస్తున్నాయి. ఈ గ్రహమాలికలో కుంభంనుంచి కర్కాటకం వరకు రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల, వరుణ, గురు గ్రహమాలికగా కనిపిస్తున్నాయి. ఆరు లేదా ఎనిమిది గ్రహాల ఈ మాలిక వల్ల కొన్ని రాశులవారికి అద్భుత యోగాలు, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహగమనాలను మాలికా స్థితిని విశ్లేషించే సిద్ధాంతులు ఈ విషయాలను మరింత స్పష్టంగా చెప్పగలరు. 

ప్రస్తుతం శుభ వీక్షణ, ముఖ్యంగా గురు గ్రహ చూపు గ్రహమాలికపై కనిపించడం విశేషించి ఫలితాలను విశ్లేషించవచ్చు.

గ్రహమాలిక జాతకంలో ఒక ముఖ్యమైన యోగం. ఇది ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగలదు. ఇది ఎలా పనిచేస్తుందో మీ జాతకంలోని ఇతర గ్రహస్థితులపై ఆధారపడి ఉంటుంది.

గ్రహమాలిక అంటే ఏమిటి?

జాతక చక్రంలో గ్రహాలు వరుసగా (క్రమంగా) కొన్ని రాశుల్లో ఉండి ఒక “మాల” లాగా ఏర్పడితే దాన్ని గ్రహమాలిక అంటారు. ఉదాహరణకు 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు వరుసగా రాశుల్లో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది.

గ్రహమాలిక వల్ల లాభాలు

గ్రహమాలిక యోగం బలంగా ఉంటే.. జీవితం లో స్థిరత్వం వస్తుంది. సంపాదన మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ, పబ్లిక్ రంగంలో పేరు, ప్రతిష్ట రావచ్చు. నిర్ణయ శక్తి  బలంగా ఉంటుంది. ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. 

ఇక్కడ మరో విషయం గమనించాలి. ఎప్పుడు ఫలితం తగ్గుతుంది? అన్న విషయాలను పరిగణన చేయాలి. వాస్తవంగా పరిశీలిస్తే ... ఇలా ఉంటే ఫలితాలు తగ్గవచ్చు. పాపగ్రహాలు (శని, రాహు, కేతు, కుజుడు) ఎక్కువగా ఉంటే అవి నీచస్థితిలో ఉంf,ñ ముఖ్య గ్రహాలు బలహీనంగా ఉంటే, ప్రస్తుతం వివిధ వ్యక్తుల జాతక చక్రాలలన పరిశీలించి వారి దశ-భుక్తి బలంగా లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. 

కుంభ  మీన  మేష రాశుల్లో రాహు, బుధ, కుజ, శని, రవి, శుక్రుల గ్రహమాలిక స్థితి ఒక ముఖ్యమైన గోచార యోగం. ఇది సాధారణంగా అందరికీ ఒకేలా ఫలితం ఇవ్వదు.  పైన ఉదహరించినట్లు రాశి, లగ్నం, దశలపై ఆధారపడి మారుతుంది.

ఎవరికి లాభం?

అయితే సామాన్యంగా ఎవరికి లాభం ఎక్కువగా ఉంటుందో ఇలా చూడొచ్చు 

ఎక్కువగా లాభం పొందే రాశులు

1. మేష రాశి ఈ గ్రహమాలిక మీ రాశికి దగ్గరగా ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఎదుగుదల, ధైర్యం, చక్కని నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది

2. కుంభ రాశి: గ్రహాలు ఈ రాశి నుంచే ప్రారంభమవుతున్నాయి. ఆర్థిక లాభాలు, నెట్‌వర్క్, ఫ్రెండ్స్ ద్వారా అవకాశాలు,దీర్ఘకాల ప్లాన్లు సక్సెస్ అవుతాయి.

మీన రాశి మధ్యలో ఉన్నందున మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఎదుగుదల, విదేశీ అవకాశాలు, కొత్త ప్రయోజనకరమైన ఆలోచనలు రావచ్చు. మార్గాలు సుగమం అవుతాయి. 

మిశ్రమ ఫలితాలు ఇచ్చే రాశులు

వృషభ, మిథున, తుల, ధనుస్సు రాశుల వారికి కొన్ని విషయాల్లో లాభం, కొన్ని చోట్ల ఆలస్యం, కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది.

జాగ్రత్త అవసరం ఉన్న రాశులు

కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర రాశులవారికి ఒత్తిడి, ఖర్చులు పెరగడం, ఆరోగ్యం, సంబంధాల్లో జాగ్రత్త. త్వరగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. 


Sunday, 5 April 2026

బ్రహ్మజ్ఞానం - బ్రాహ్మణుడు

 జన్మనా జాయతే శూద్రః

సంస్కారాత్ భవేత్ ద్విజః

వేదపాఠాత్ భవేత్ విప్రః

బ్రహ్మజ్ఞానాత్ ఇతి బ్రాహ్మణః


మానవుడు తన జన్మచేత శూద్రుడు మాత్రమే. వానికి తండ్రి వడుగు చేసినంత, ద్వితీయజన్మనొందిన వాడై ద్విజుడౌతాడు. వేదం నేర్చుకొనిన అనంతరం విప్రుడౌతాడు. అతడు బ్రహ్మజ్ఞానం తెలుసుకొనిన అనంతరమే బ్రాహ్మణుడౌతాడు. అంతేకానీ, పుట్టుకతో బ్రాహ్మణుడెవరూ కాదు.

Tuesday, 24 January 2023

మేలు చేసే శనీశ్వరుడు

జ్యోతిష్యం ఒక శాస్త్రం దీనిని చక్కగా అవగాహన చేసుకుంటే ప్రయోజనాలు ఎన్నో సిద్దిస్తాయి. నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలు భవిషత్తు, వర్తమానం తెలుసుకోడానికి అవగాహన కలిగించుకోడానికి జ్యోతిష్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. పన్నెండు గ్రహాల గమనం మనవ జీవనాన్ని నడిపిస్తాయి ప్రభావితం చేస్తాయి. సహజంగా జరుగుతున్న సంఘటనలకు అతీతంగా రాగద్వేషరహితంగా ముందుకు వెళుతున్నవారికి గ్రహాలు వాటి గమన సమయంలో ప్రతికూల ఫలితాలు ఇచ్చే సమయంలో సైతం పైన ఉదహరించినవారికి అనుకూలంగా ఫలితాన్ని ఇస్తాయి. వారిపై తమ ప్రతికూలతను ప్రదర్శించలేవు.
ముఖ్యంగా నడవడికను అనుసరించి ప్రవర్తిస్తున్న విధానాలను అనుసరించి వెంట వెంటనే ఫలితాలను మనముందు ఆవిష్కరించే గ్రహం శని. శనేశ్వరుడు అను కూడా వ్యవహరిస్తాము. నవగ్రహాలలో శని మినహా మరే గ్రహాన్ని (శని G ఈశ్వరుడు) శనేశ్వరుడు అని పిలువము. ఎందుకంటే ప్రతి 30 సంవత్సరాల కాలంలో శని ఏడున్నర సంవత్సరాలు వరుసగా ఫలితాలను ఇస్తూనే ఉంటాడు. ఆ ఫలితాలు అన్నవి నడవడికపైన ఆధారపడటం అన్న విషయం ఆలోచనలకు అందని విషయం.
జ్యోతిష్య విజ్ఞానాన్ని ఒక వ్యాపారంగా ఉపయోగిస్తున్న ఈ రోజులలో వాస్తవాన్ని అందరిముందు ఆవిష్కరించాలన్న చిరుప్రయత్నం ఇది. విజ్ఞానరహస్యాలను అందరికీ తెలియాలన్నదే నాప్రయత్నం కానీ మరొకరిని కించపరచాలన్న ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదన్న విషయం గమనించి లోతుగా పరిశీలించి ప్రయోజనం పొందాలని నా విజ్ఞాపన. ముఖ్యంగా సాడే సాత్‌ శని గురించి నాముందుకు వచ్చిన విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని తగు విధంగా స్పందించాను. మరింత లోతుగా సమాధానాలు కావాల్సిన వారు నేరుగా స్పందిచవచ్చు. తగు సమాధానాలు పొందవచ్చు.
ఒక సందర్భంలో ఆపదవచ్చిన తరువాత దానిని తప్పించుకునే ప్రయత్నంలో దైవాన్ని ఆశ్రయించడం, పూజలు, హోమాలు చేయడం సర్వ సాధారణం. దీనివల్ల కాస్త ఉపశమనం మాత్రమే దక్కుతుంది. వర్షంలో వెళుతున్నప్పుడు గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం కన్నా ముందు జాగ్రత్త పడితే జరిగే మేలు ఎక్కువ!
పెను ప్రమాదాలు, మృత్యుగండాలు సైతం ముందుగా చేస్తున్న గో పూజలు దానాలు, ధర్మాలు వల్ల అధిగమించవచ్చు. అయితే అది ప్రమాదమని మనం తెలుసుకునే అవకాశం లేదు. కానీ శనీశ్వరుడు పన్నెండు రాశులలో గమనం చేస్తున్న సమయంలో ఏరాశిలో ఉన్నాడో ఆరాశి, ఆరాశికి ముందు వెనుక ఉన్న రాశులు సాడే సాత్‌ శని ఉన్నట్లుగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
సాడే సాత్‌ శని అంటే ఏమిటి ? దీని వలన సమస్యలు వస్తాయా? నివారణ చర్యలు ఉన్నాయా ? అన్న ప్రశ్నలు మన ముందు కనిపిస్తాయి. నవ గ్రహాలలో ‘శని గ్రహం’ ఒకటి. శని సూర్యుని పుత్రుడు. అయినా జ్యోతిష్యంలో శని సూర్యుడికి శత్రువనే చెబుతారు. సాడే సాత్‌ శని అంటే ‘‘ఏడున్నర సంవత్సరాల కాలం శని’’ అని అర్థం. దీనినే ఏల్నాటి శని అని కూడా అంటారు. ప్రతి జాతకుడికి ఇది అత్యంత కష్ట కాలం అని చెబుతారు. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి జాతకుడి జీవిత కాలంలో శని సంచారం అనేది కనీసం 2 పర్యాయాలయినా వస్తుంది. సాధారణంగా ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాలు శని ఉంటుంది. ఆ విధంగా 12 రాశులు తిరిగి రావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇది సహజంగా ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చేదే. ఎవరూ దీని నుండి తప్పించు కోలేరు. శని అన్ని సార్లు., అందరికి చెడు మాత్రమే చేస్తాడనుకోనవసరం లేదు. మంచి చేసే సందర్భాలు కూడా ఎక్కువే. శని కష్ట జీవి. శ్రామికుడు. మన చేత కష్టాలను చూపిస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాలను చూపిస్తాడు. అందుకని శని దశాలకైనా., ఏల్నాటి శనికైనా., అర్దాష్టమ., అష్టమ శనికైనా భయపడ కూడదు. ఏ గ్రహ సంచారం ఆ గ్రహం చేసుకుంటూనే పోతుంది. కర్మఫలాన్ని మనం చూస్తూ అనుభవించాలి., ఆస్వాదించాలి తప్పా భీతిచెంద కూడదు. దేన్ని నమ్మినా నమ్మక పోయినా గ్రహాల శక్తిని అందరూ ఒప్పకుంటారు. ఎందుకంటే మనకు ప్రతి రోజూ గ్రహాల శక్తి గురించి కళ్లారా చూస్తున్నాం. అనుభవిస్తున్నాం. ప్రతి రోజూ సూర్యుడు., తూర్పు దశ సరైన సమయానికి ఉదయిస్తాడు. మనమూ లేస్తాం. సాయంత్రం కరెక్ట్‌ సమయానికి అస్త మిస్తాడు. అలాగే మిగిలిన గ్రహాల గమనాలు ఉంటాయి. పన్నెడు రాశులలో వాటి సంచార కాలంలో పరస్పరం కలహించుకుంటాయి. అనుకూలంగా వ్యవహరించుకుంటాయి. అనుకూల, ప్రతికూల సమయాలను అనుసరించి సమస్యలు ఎదురవుతాయి. మంచిపనులు జరుగుతాయి.
ఏల్నాటి శని దోష నివారణకు, శాంతికి వేల రూపాయలను మరెవ్వరికో దోచి పెట్ట నవసరం లేదు. వైరాగ్యానికి., నిరాశ, నిస్పృహకు గురికాకుండా స్పందించాలి. భయ పడవలసిన అవసరం అంతకూ లేదు. కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ముందుగానే కొంత అవగాహన తెచ్చుకుని., ఎవరికీ వారే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
ఈశ్వరునికైనా శనీశ్వరుని బాధ తప్పలేదని పురాణ ప్రవచనం. పెద్దలు చెప్పగా వింటున్నాం శని ఎలా పడుతుందో చూస్తా అని పోయి చెట్టు తొర్రలో లేదా నీటి మడుగులో దాక్కున్నాడట.
వాస్తవానికి వస్తే అవి కథలని కొట్టిపారేయలేం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రారబ్ధ కర్మల నుంచి ఎవ్వరూ తప్పించు కోలేరు. ప్రారబ్ధ కర్మలు ఇవి విడిచిన బాణం లాంటివి అని వచ్చే సమస్యలను ఎవరూ తప్పించ లేరు. నివారణోపాయాలు మన జీవన మార్గలో అన్వేషించాలి. భగవత్‌ భక్తి, గో సేవ కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. మంచి ఆలోచన చక్కని మార్గం చూపే అవకాశం ఉంది. ప్రతి జాతకుడి జీవితంలో కనీసం రెండు సార్లు సాడే సాత్‌ శని వస్తుంది.
ముఖ్యంగా నిజాయితీగా డబ్బు సంపాదించి పొదుపు., క్రమశిక్షణ గల వారికి గర్వం ఉండదు. వినయ విధేయతలు కలిగి ఉంటారు. దాన గుణం ఉంటుంది. ప్రేమాభి మానాలు ఉంటాయి. నలుగురితో అనుబంధాలుంటాయి. సత్సంభందాలుంటాయి. భక్తి భావాలు ఉంటాయి. అన్నిటికి మించి మంచి ఏదో చెడు ఏదో వీరికి బాగా తెలిసి ఉంటుంది. ఆరోగ్యం పై మంచి శ్రద్ద ఉంటుంది. అన్నిటికి కావాల్సింది డబ్బు. సరి పడా డబ్బు కూడా పొదుపు చేసుకునే ఉంటారు. ఇన్ని సుగుణాలు ఉన్న వీరిపై శని ప్రభావం ఎంత మాత్రం కన పడదు.
‘సాడే సాత్‌ శని’ ప్రభావం ప్రతీ సారి, ఒకే సారీ మూడు రాశులపై ఉంటుంది. ఈ ఏడున్నర సంవత్సరాలు ఏల్నాటి శని అంటారు. ప్రస్తుతం కుంభ రాశిలో శనీశ్వరుడు ఉన్నారు. దాని ప్రభావం., దాని ముందు రాశి అయిన. మీనంలోను., అలానే దాని వెనుక రాశి అయిన మకర రాశిలో సాడే సాత్‌ శని ఉంది. మరో విధంగా చెప్పాలంటే జాతకుడి రాశి నుండి లెక్క బెడితే 12,1,2వ స్థానాలను సాడే సాత్‌ శని గా చెప్పుకోవచ్చు. 4 ను అర్దాష్టమ శనిగా మరియు 8 వ స్థానాన్ని అష్టమ శనిగా చెబుతారు. ఇది జాతకునికి గడ్డుకాలం. భక్తి శ్రద్ధలతో, నిజాయితీగా వ్యవహరించినవారికి పరిహారం లభిస్తుంది. నిర్లక్ష్యం చేసినవారు ఇబ్బందులు అనుభవించక తప్పదు.
17 జనవరి 2023 నుండి సాడే సాత్‌ శని ప్రభావం కుంభ రాశి లోను., దాని ముందు రాశి అయిన మీనం రాశి లోను మరియు దాని వెనుక రాశి అయిన వృచ్చిక రాశి అర్దాష్టమ శని, కర్కాటక రాశివారి అష్టమ శని ప్రభావం ఉంటుంది.
శని అనేది శక్తి వంతమైన గ్రహం. ఒక్కో స్థానంలో ఉన్నపుడు ఒక్కో ప్రభావాన్ని చూపెడుతుంది. కొన్ని గ్రహాలతో కల్సి ఏ రాశిలోనైతే సంచరిస్తుందో ఆ రాశి జాతకులపై., అధిక శని ప్రభావం ఉంటుంది. ఆయా రాశులలో గ్రహసంచారం ఆధారంగా మంచీ, చెడు ఫలితాలు ఉంటాయి. సాడే సాత్‌ సమయంలో మేలు జరుగుతున్న సందర్భాలు ఉంటాయి. ఆయా సమయాలలో గ్రహగమనాలను గమనిస్తేకాని వాస్తవం గోచరం కాదు.
చంద్రస్థిత రాశి స్థానం నుండి లెక్కించి నపుడు 12, 1, 2, 4 మరియు 8 వ స్థానంలలో శని సంచారం జాతకుడికి అత్యంత ప్రమాద కరమైనటు వంటి సమయంగా పరిగణిస్తారు. చాలా కాలంగా శాస్త్ర పరిశోధనలు చేసినవారు ముందు జాగ్రత్తగా చెబుతారు. ఆవిషయాలను అవగతం చేసుకుని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంతకూ సాడే సాత్‌ శని వలన ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందో జ్యోతిష్య పండితులు పలు సందర్భాలలో ఉటంకించారు. ఆవిషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. సమస్యలు ఎలా ఉన్నా నివారణ ఉపాయాలు కూడా ఉన్నాయి.
‘సాడే సాత్‌ శని’ గురించి పూర్తిగా అవగాహన పెంచు కోవాలి. ప్రస్తుతం కుంభరాశికి ముందు వెనక రాశులలో సాడే సాత్‌ శని నడుస్తుంది. జాతకుల రాశి నుండే ఎవరికీ వారే 12, 1,2, 4, 8 వ రాశులను లెక్క పెట్టు కోవచ్చు. నివారణ చర్యలను చేపట్ట వచ్చు. ఆర్ధికంగా బలంగా ఉంటే సాడే సాత్‌ శనిప్రభావం పెద్దగా మన మీద కన బడదు . ఎప్పటి నుండో ఉన్న దీర్ఘ రోగాలకు ., సమస్యలకు ‘ సాడే సాత్‌ శనే ‘ కారణం అని భయ పడ నవసరం లేదు. ఓపికను పెంచు కోవాలి. కోపాన్ని తగ్గించు కోవాలి. పూర్తి సమా చారం వచ్చిన తరువాతనే జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రశాంతంగా ఉండటం మెల్ల మెల్లగా అలవరచు కోవాలి. వత్తిడిని ., అధిక పని భారాన్ని తగ్గించు కోవాలి. తొందర పాటుతగదు.
ఏకాగ్రత మెడిటేషన్‌ అలవరచు కోవాలి., సరి పడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
సర్దుబాటు ధోరణి అలవరచుకోవాలి. సమస్య అధికంగా కన బడితే., సాడే సాత్‌ శని కాలంలో., శని గ్రహ పూజను ప్రతి శని వారం చేయడం గొప్ప నివారణ చర్య అవుతుంది. పూజ చేయు నపుడు శని గ్రహం మీద ఒక నల్లని కొత్త బట్టను కప్పి., దానిపై మెల్లగా ఒక లీటర్‌ నువ్వుల నూనెను పోయాలి. నల్లటి నువ్వుల గింజలను తీసుకుని మెల్లగా శని గ్రహంపై జార విడువాలి. ఆ తరువాత శని గ్రహం చుట్టూ ప్రదక్షణలు చేయాలి.
కిలోమ్బావు నల్ల నువ్వులను తీసుకుని., మీటరుంబావు నల్లగుడ్డను., ఒక ముక్క నల్ల బెల్లం., ఒక ఇనుప మొలను మరియు రూపాయి లేదా రెండు రూపాయల బిళ్ళ కల్పి ఏదయినా గుడిలో ఒక నల్ల పూజారికి శని వారం దానం చేయాలి.
శని గ్రహ మంత్రాన్ని పఠించాలి.
శివ పంచాక్షరీ, మహా మృత్యుంజయ మంత్రాలను పఠిస్తూ పూజించాలి.
పక్షులకు ముఖ్యంగా కాకులకు ధాన్యాలను వేయాలి.
నల్ల చీమలకు చక్కెరను గాని., తేనె ను గాని తినిపించాలి.
ప్రతినిత్యం శని మంత్రం పఠించాలి.
రామాయణ కాలంలో దశరథుడు పఠించిన శని స్త్రోత్రాన్ని పఠించాలి.
హనుమాన్‌ చాలీసాను ప్రతి రోజు పఠించాలి.
ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే విధంగా చూసు కోవాలి. ఎదో ఒక వ్యాపకం లో నిమగ్న మవ్వాలి.
ప్రతి రోజు కనీసం 3 సార్లు నీలాంజనం సమా భాసం., రవి పుత్రం యమా గ్రజం., ఛాయా మార్తాన్ద సంభూతం., తం నమామి శనైశ్చరం’’ అని పఠించడం వలన శని గ్రహన్ని శాంతింప చేయవచ్చు.
మంచి చేసినా చెడు చేసినా దానికి వలసిన కర్మ ఫలాన్ని అనుభవించడానికి తగు యోగ్యమైన కాలంగా శనేశ్వరుడు సంచరించే ఏడున్నర సంవత్సరకాలంలో నిర్ణయిస్తాడు. వారి వారి ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా పనిచేసేలా వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో మన ముందు ఆవిష్కరిస్తారు. అయితే ఈ ఆవిష్కరణ సమయంలో మానవులు నడుచుకుంటున్న వ్యవహారాల శైలిని అనుసరించి కొన్ని పనులను చేసే సమయంలో వాటికి వల్ల ఎదురయ్యే ఫలితాలను మనం మానవులు అనుభవించక తప్పదు.
సాధారణంగా మానవులందరూ ఒకే రకంగా ఉండరు న్యాయాన్ని విచక్షణ కూడా తరు పాటించరు ఈ విధానాన్ని అనుసరించే వారి వారి కి ఇబ్బందులను కలిగించడం కర్మ ఫలాన్ని అనుభవించేలా చేయడం భగవంతుని గుర్తుచేయడం లాంటివి తార్కికంగా జరుగుతాయి. అసలు జీవితంలో ఒడిదుడుకులు లేని సమయం అంటూ ఉండదు మంచి కాలం వచ్చినప్పుడు ఇది తమ గొప్ప అని భ్రమ పడటం కూడా జరుగుతుంది. వాస్తవాలను మనం బేరీజు వేసుకున్నప్పుడు మంచి చెడులను కూడా వేసుకోవాలి కర్మ ఫలాలు అనుభవయోగ్యంగా మలుచుకునే నైపుణ్యం మనిషికి శనీశ్వరుడు ఇచ్చాడు. వారు ప్రతి సమయంలో ఎదుటివారి క్షేమాన్ని కాంక్షిస్తూ నడుచుకున్న వారికి సాడే శాస్త్ర సమయంలో కానీ అర్దాష్టమ సమయంలో కానీ అష్ట మా సమయంలో కానీ శని వల్ల ఎలాంటి అపకారం జరగదు కానీ ఆయా సమయాల్లో వారికి ఆర్థికంగా పుంజుకునేలా శనీశ్వరుడు తోడ్పడతాడు. ఆ సమయాల్లోనే వివాహ కాలాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా స్థిర, చరాస్తులు కొనుక్కునేలా అందరిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొనేలా చేస్తాడు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే మన మానవులు చేసుకుంటున్న చేస్తున్న కర్మ ఫలాలకు ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు ఎప్పుడు ఏదో రకంగా ఎదుటివారిని మోసం చేసేవారు కొన్ని సమయాల్లో వారు కూడా మోసపోవడం లేదా ఇబ్బందులు పడడం అయితే ఈ ఇబ్బందులన్నీ చాటే సమయంలో చాలా కఠినంగా ఉంటాయి.
నమ్మకం జీవన సాఫల్యానికి విజయానికి తొలిమెట్టు.
అవగాహనకు మరికొన్ని విషయాలు త్వరలో…

Monday, 24 October 2022

వ్యక్తి వికాసానికి విద్య

విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః!
విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీనః పశుః!!
వ్యక్తి వికాసానికి, యోగ్యతకు విద్యకు అధిక ప్రాధాన్యం ఉంది. ‘‘పురుషునికి రూపసమానమైనది, విద్య గలవాడు అందగాడు కాకపోయిననూ దీనికి ఉన్న యోగ్యత ధనానికి ఉండదు. సంరక్షణలో దాచిపెట్టిన ధనమిది. ఈ విద్య భోగ భాగ్యాలనూ, యశస్సునూ, సుఖములనూ ఇస్తుంది. మనకు విద్యనందించు గురువులను తయారుచేసిన గురువులకే గురువు ఈ విద్య. విదేశాలకు వెళ్ళినా కూడా మన బంధు జనుల వలె ఆదరిస్తుంది ఈ విద్య. గొప్పవారితో కూడా పూజించబడుతుంది. అన్ని దేవతల కంటే పెద్ద దేవత ఈ విద్య. ఈ లోకమున అందమైన జీవితమును గడుపుటకు ఉపయోగ పడుతుంది. ఈ విద్య లేనివాడు పశువుతో సమానమే కదా అని కవి హృదయము.’’ అందుకే విద్య ఎక్కడ లభిస్తుందో అక్కడికి పూర్వం విద్యార్ధులు వెళ్ళేవారు. అలా శ్రీరంగానికి, కాశీకి, కాశ్మీరులోని సరస్వతీ పీఠానికి వెళ్లి అధ్యయం చేసినవారున్నారు. సాంప్రదాయ చదువును కోరే మీకోసం ఇదిగో అంటూ మీ ఇంటివద్దకే వచ్చి అంతర్జాల మాధ్యమంగా ‘‘యాజ్ఞికపీఠం వైదిక పాఠశాల’’ చేస్తున్న వైదికసేవలను ఆస్వాదించండి. మరింత మందికి అందించండి.

Tuesday, 2 March 2021

అక్షర ఉచ్చారణ దోష ఫలం

 అక్షర ఉచ్చారణ దోష ఫలం

శ్లోకం:-  అవాక్షర మనాయుష్యం
            నిస్వరం వ్యాధి పీడనం
            అక్షరం శస్త్ర రూపేణ
            వజ్రం పతతిమస్తకే

            (పాణినీయ శిక్ష)
అర్థం:-
ఎవరైతే మంత్రాన్ని అక్షర దోషాలతోగాని, అపస్వరముతో గాని చదువుతారో వారిని ఆ అక్షరమే ఆయుధమై ఆయుష్షు క్షీణించి, వ్యాధి రూపంలో పీడించి, జ్ఞాపకశక్తిని పూర్తిగా నశింపచేస్తుంది అని మనకు   ’పాణినీయ శిక్ష’ లో చెప్పబడింది. అందుకే మంత్రాన్ని గురు ముఖంగా నేర్చుకోవాలి, వల్లించాలి.

Friday, 18 December 2020

కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన

 

కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన

 

భగవత్ భాగవత కటాక్షాలతో జ్యోతిష శాస్త్ర పరిధిలో కరోనాపై ఒక జ్యోతిష పరిశీలన అనే అంశంపై ప్రశ్నలు - సమాధానాలు రూపంలో మా శక్తి మేరకు మన పెద్దలు మనకి అనుగ్రహించిన విషయాలని కాస్త మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆస్థాన పంచాంగ సిద్ధాంతి, సుప్రసిద్ధ పంచాంగ కర్త, దైవజ్ఞ శిఖామణి, జ్యోతిష రత్న, శ్రీ ఉ.వే.శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకుందాం.

 

ప్రశ్న:- ఈ కరోనా (కోవిడ్-౧౯) వైరస్ పుట్టుకకు కారణమేమిటి?

 

వందే పద్మావతీం దేవీం మహిషీం వేంకటేశితుః

కృపయాస్మాన్ సముద్ధర్తుం కృతావతరణాం భువి

 

శ్రీవాత్స శ్రీనివాసార్యః శోణుం గోవింద దేశికం

సంప్రాప్తోభయ వేదాంత సారం సద్గురుమాశ్రయే

 

ప్రియ భగవత్ బంధువులందరకూ జై శ్రీమన్నారాయణ. యాజ్ఞికపీఠమ్ నుంచి శ్రీమాన్ కిశోరస్వామి వారి ప్రార్ధన మేరకి పెద్దలు అనుగ్రహించిన విషయాలను మనం చర్చించుకుంటున్నాం.

సమా:- ఈ శార్వరి నామ సంవత్సరంలో పెద్ద ఉపద్రవం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది వికారి నామ సంవత్సరంలో ఏర్పడింది. వికారి నామ సంవత్సరంలో ఆరంభమైన ఈ సన్నివేశం ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? అని మనం ఒకసారి చూసినట్లయితే...

యదా జీవయుతో మందో జీవాద్వా సప్తమే స్ధితః

తదా ప్రజా వినశ్యంతి... అన్నట్లు

 

 బృహస్పతి శనితో కలిసి ఉన్నా,  శని నుండి సప్తమంలో ఉన్నా ప్రజా నాశనం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడతాయి అని ప్రమాణం. అక్టోబర్ ౨౦ ౨౦౧౯ బృహస్పతి శనితో కలవడం. శని గురు కేతు గ్రహాలు ఎప్పుడు ఒకే రాశిలో ఉన్నా యుద్ధాలు, దుర్భిక్షాలు, అంటువ్యాధులు కలుగుతూంటాయి. అదే మిధున కన్య ధనుస్సు మీన రాశులలో అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది. అయితే అదే ధనుస్సులో మూడు గ్రహాల కలయిక జరిగింది. అది సూర్యుడు తులా రాశి నుండీ మకర రాశిలోకి ప్రవేశించే కాలం. ఆ సమయంలో వైరస్ ఏర్పడింది. లేదా పుట్టింది.

 

ప్రశ్న:- ఈ వైరస్ తీవ్రత, ఎక్కడ ఎలా ఆరంభమైంది?

 

సమా:- ఈశాన్య దేశేషు అనే ప్రమాణంతో ఈశాన్య ప్రాంతంలో ప్రారంభం అవుతుంది అనీ, ఆ ప్రాంతంలోనే చైనా ఉంది అని మనకు తెలుస్తోంది. చైనాలోనే ఈ వ్యాధి ప్రారంభమైనా ఆ దేశం అప్పుడే బయట పెట్టలేదని అమెరికన్ రిపోర్ట్ చెబుతోంది కానీ...

 

రవి రాహు మహీపుత్రాః శశి శుక్ర శనైశ్చరాః

ఏక రాశిం గతాశీతే తదా పృథ్వి భయాకులా

పూర్వదేశే మహా పీడా నృపాణాం సంక్షయో భవేత్

ప్రజా నాశో జాయ భయం తస్క.....న సంశయః

 

రవి రాహు చంద్ర శుక్ర శని గ్రహములు ఏకరాశి గతులైనప్పుడు భూమండలమందు భయం ఏర్పడుతుంది. తూర్పు దేశాలలో మహాపీడ, నాయకులకు నాశనము, వ్యాధి భయము, ప్రజా నాశనము నిస్సందేహముగా కలుగుతాయని ప్రమాణం. డిసెంబర్ ౨౬న షష్ఠ గ్రహ కూటమి ౬ గ్రహములైన గురు శని కేతు రవి చంద్ర బుధులతో ధనస్సులో ఏర్పడడం జరిగింది. సాధారణంగా షష్ఠ గ్రహ కూటమి ఏర్పడటం జరుగదు. అలా ఏర్పడితే అది ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది అని అర్థం. అదృష్టం కొద్దీ కుజ శుక్రులు అక్కడ లేరు అది కొంత విశేషం. ఈ గ్రహాల కూటమి వల్ల ఏర్పడ్డ వైరస్ క్రమంగా పెరుగుతూ డిసెంబర్ ౩౧న ప్రపంచానికి తెలిసింది.  ఇలాంటి గ్రహస్థితి ఏర్పడినప్పుడే మహామారి ప్రారంభమైంది. ప్రజా వినాశనానికి బీజం పడిందని అని చెప్పవచ్చు. రాహువు ఆర్ద్రా నక్షత్రంలో మిధున రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు మకరంలో గురువు ధనుస్సులో ఉన్నాడు. ధనుస్సులో ఐదుగ్రహాలు కలవటంతో మరొక ’పంచ గ్రహ కూటమి’ ఏర్పడింది.

 జనవరి ౨౩వ తేదీన చంద్ర బుధ శని రవి గ్రహాలు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశించాయి. అప్పుడు గురువు ధనస్సులో ఉన్నాడు. గురు కేతువుల కలయికతో ప్రపంచం అంతా వైరస్ గురించి తెలిసింది. దీనిలో శని సూర్య సూర్యుల కలయిక జరిగింది.  శని సూర్య గ్రహాలు వైర గ్రహాలు. వీరి కలయిక మృత్యు ప్రళయ సూచిక. ఇదంతా మకర సంక్రాంతి తరువాత తారాస్థాయికి చేరుకొని ప్రపంచ దేశాలకు పాకడానికి కారణం అయింది. ఇది అత్యంత దుఃఖాన్ని కలగజేస్తోంది.

 

యదా కర్కస్య సంక్రాంతి రధా మకరస్య సౌ

భవత్కార్యాహి భౌమానం వాణీ దుఃఖ ప్రదామతా

 

 మకర సంక్రాంతి తరువాత ఇది తీవ్రరూపం దాల్చింది. కుజుడు మకరంలో శని గురువులతో కలయిక జరిగింది. అయితే ఫిబ్రవరి ౮న కుజ కేతు గురువుల కలయిక వల్ల ప్రపంచమంతా పెను ప్రమాదంగా మారింది. కనుక కుజ కేతువులతో  గురువు కలవటం వల్లే  వైరస్ ప్రభావితం అయింది. దానివల్లే ప్రపంచమంతా బీభత్సంగా మారిపోయింది అని స్పష్టమవుతోంది. అలాగే ఫిబ్రవరి ౧౮ నుండి మార్చి ౫ వరకు రాహు కేతువుల మధ్యలో ఇతర గ్రహాలు చేరి కాల సర్పదోషం ఏర్పడింది. ఇంకా కొంచెం పరిశీలన చేసినట్లయితే మండుచున్నటువంటి అగ్నిలో ఆజ్యం వేసినట్లయింది.  దాంతో ఈ కాలసర్ప స్థితి ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మానవాళికి ఉపయోగపడే శుభ గ్రహాలకు వాటి ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది. అంటే మంచిని కలిగించే గ్రహములు వాటి శక్తిని కోల్పోవడం వల్ల జనజీవనం స్తంభించడం జరిగింది. అంతే కాకుండా ప్రజలకు మృత్యువు విచిత్రంగా ఉంటుంది. అధికంగా విపత్తులు ఏర్పడతాయి ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉంటుంది అనేది అర్థం అవుతోంది. దాని ప్రకారమే అందరూ అనుభవించారు అనుభవిస్తున్నారు కూడా....

 భారతదేశం గురించి విశేషంగా చెప్పాలంటే మనది ఒక గొప్ప దేశం. ముఖ్యంగా ఆధ్యాత్మికత పొందిన దేశం. ఆధ్యాత్మికత ఎక్కువగా మన దేశంలో వుండటం చేత గ్రహ ప్రభావం అంటే, వాస్తవికంగా చెప్పాలంటే ఎప్పుడైతే బృహస్పతి వక్రించడం శని వక్రించడం లాంటివి జరిగాయో వీటివల్ల మనకు ప్రజా నష్టం ఎక్కువుగా జరగకుండా కాపాడింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే కేతువు ధనస్సులో కుజుడు గురువు కేతువులను వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా మారడం వల్ల తగ్గుముఖం పడుతుంది అనేది కనబడుతోంది. దీనివల్ల కొంత ప్రశాంతతను ఇస్తుంది. మార్చి ౨౯, ౩౦ తేదీల్లో కేతువుని గురువు కూడా వదిలి పెట్టడం వల్ల కేతువు ఒంటరి వాడయ్యాడు. దీనితో జనాలలో కొంత అవగాహన పెరగడం, కొద్దికొద్దిగా వైరస్ తగ్గినట్లు అనిపించినా కూడా భయాందోళనలు పూర్తిగా ఇది నిర్మూలన అనేది జరగదు. ఆ తరువాత మనకి ఉగాది నాటి నుండి ఒకసారి గ్రహాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మార్చి ౨౫న ఉగాది ఏర్పడింది. శార్వరి అంటే చీకటి అని మాత్రమే అందరికీ తెలిసింది. కానీ చీకట్లను పారదోలడానికి భగవంతుడు ఎలా వస్తాడో కూడా ఇందులో చెప్పాడు. శార్వరిలో చీకటిమయం కాబోతున్న ఈ సంవత్సరంలో మన దేశం ఆధ్యాత్మికతతో కూడిన దేశం కనుక మనల్ని రక్షించడానికి పెరుమాళ్ శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడో ఈ శార్వరిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.

ప్రశ్న:- ఈ సంవత్సరంలో చాతుర్గ్రహ, పంచ గ్రహ, షడ్గ్రహ కూటములు ఎన్ని ఉన్నాయి? వాటి ప్రభావమేమిటి?

సమా:- ఈ శార్వరీ నామ సంవత్సరంలో ౧౦ సార్లు చాతుర్గ్రహ కూటములు, ౪ సార్లు పంచ గ్రహ కూటములు, రెండు సార్లు షట్ గ్రహ కూటములు ఉన్నాయి. కొన్ని ఏర్పడ్డాయి, మరికొన్ని ఏర్పడబోతున్నాయి. వాటివల్ల అనేక రోగపీడలు, పరస్పరము రాజులు కలహించుకోవడం అలాగే వాయుపీడ, దాంతో పాటుగా మంచి వర్షాలు కనిపించినా దాని వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం లాంటివి ఉంటాయి.

ఒకసారి ఆ తేదీలను పరిశీలిద్దాం...

 

ధనుస్సులో బృహస్పతి ఉంటే...

వీత రోగ భయాస్సర్వే చాపస్ధే దేవ పూజితే

హృదయానందినీ ధాత్రీ పరశాలీ సువృష్టిభిః

 

సమస్త జనులు రోగం లేక మంచిగా ఉంటారు. వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి.  మకరంలో బృహస్పతి వచ్చినప్పుడు...

 

అసత్ప్రభో జనాధాత్రీ పూర్ణ సస్యానువృష్టిభిః

వీత రోగ భయాస్సర్వే మకరస్ధే సురార్చితే

 

ఇది మరొక ప్రమాణం. సకల జనులు శత్రు రోగ భయ రహితులై ఉంటారు. సువృష్టి చేత భూమి సస్యశ్యామలమై ఉంటుంది. కుంభంలోకి బృహస్పతి వస్తే...

 

బృహస్పతే కుంభగతే ధరిత్య్రాః కుంభాభిషేకాశ్చ శివాలయేషు

భద్రాసనారోహణ మంగళాప్తిర్మహీ భుజాం శూద్రజనో చ్ఛ్రయస్యాత్

అని శివాలయములో కుంభాభిషేకములు జరుగుతాయి. రాజులు సింహాసనం ఎక్కుతారు. శూద్రులు గొప్ప స్థితికి వస్తారు అని ఒక ప్రమాణం. కానీ ఇక్కడ ఈ సంవత్సరం ముఖ్యంగా బృహస్పతి, శని వక్రించి ఉండటం చేత శని వక్రారంభం అయిన తరువాత అది ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయింది ఈ వైరస్. బృహస్పతి వక్రించినప్పటికీ కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక బలం కలిగి ఉండటం చేత ప్రధానమైన ప్రజా నష్టం పెద్దగా జరగకుండా కాపాడింది. గురువు వక్రించి ధనస్సులో కేతువుతో కలవడంతో జూలై ౧నుండి వ ురింత విజృంభిస్తోంది.

ప్రశ్న:- ఈ కరోనా అంతమయ్యేది ఎప్పుడు?

సమాధానం:- రేపు ౧౩.౯.౨౦౨౦న గురువు త్యాగం అవుతున్నాడు అంటే తదుపరి వ్యాక్సిన్ లాంటి ఔషధం రావచ్చు. అలాగే ౨౯ సెప్టెంబర్ శని వక్ర త్యాగం కనుక ఈ కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతుంది అని తెలుస్తోంది. అలాగే ౧౮ నవంబర్ కేతువు ధనస్సు వీడి వృశ్చికానికి వెెడుతున్నాడు. ఆ వెళ్లడం చేత ఈ కరోనా వ్యాధి దానంతట అదే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. దాని కంటే ముందుగా ఇంకా చూస్తే మనకి రేపు అధిక ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి  ౨౪ సెప్టెంబర్ నుండి దీని తగ్గుముఖం పట్టి ఒక ఔషధం కనిపించే అవకాశం విశ్వాసంతో పూర్తిగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంది.

ప్రశ్న:- ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలాంటి వైదిక కర్మలను ఆచరించాలి?

సమాధానం:- కాలచక్రంలో ఉపద్రవములు ఏర్పడ్డప్పుడు అద్భుత శాంతులు చేయటానికి ఒక ప్రక్రియ ఉంది. అది మనకి స్పష్టంగా ఋష్యాదులు లాంటి పెద్దలు మనకు అనుగ్రహించారు.  షష్ఠ గ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?

చాతుర్గ్రహ కూటములు బాగా ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?

పంచ గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు ఏమి చేయాలి?

అనేది ఈ ప్రాయశ్చిత్త కాండలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా అనేక ఉపద్రవాలు ఏర్పడ్డప్పుడు, జగత్తుకి సంక్షోభం ఏర్పడ్డప్పుడు అద్భుతశాంతి జరిపినట్టుగా మనకి ఒక ప్రమాణం కూడా కనబడుతోంది.

ప్రశ్న:- మరి దీన్ని గతంలో ఎవరైనా ఎప్పుడైనా ఆచరించారా?

సమాధానం:-  భృగువు అనే మహర్షి పూర్వం ఆచరించాడు అని ఉంది. శ్రీ మహావిష్ణువుకి ౨ పాదములు - మూలా నక్షత్రం. ౨ పిక్కలు - రోహిణి నక్షత్రం. ౨ మోకాళ్ళు - అశ్విని నక్షత్రం. ౨ తొడలు - పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు. ౨ పృష్ఠము - పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు.  నడుము - కృత్తికా నక్షత్రం. ౨ పార్శ్వాలు - పూర్వాభాద్ర ఉత్తరాభాద్రలు. ఉభయ కుక్షి - రేవతి నక్షత్రము. వక్షస్థలం - అనురాధ. పృష్ఠ ప్రదేశం - ధనిష్ఠ. ౨ భుజములు - విశాఖ. ౨ చేతులు - హస్త. వ్రేళ్ళు - పునర్వసు. గోళ్ళు - ఆశ్రేష. కంఠము - జ్యేష్ఠ.  చెవులు - శ్రవణం. ముఖము - పుష్యమి. దంతము - స్వాతి. దవడలు - శతభిష. ముక్కు - మఖ. నేత్రములు - మృగశిర. లలాటమ - చిత్త. శిరస్సు - భరణి. జుట్టు - ఆర్ద్ర. ఇలా శ్రీమహావిష్ణు స్వరూపాన్ని వర్ణించబడిఉంది. దీన్ని నక్షత్ర పురుషము అంటారు. ఈ నక్షత్ర స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపము అనీ, దీన్ని జగత్ సంక్షోభము ఏర్పడినప్పుడు అద్భుత శాంతి ప్రక్రియగా భృగుమహర్షి ఆచరించాడు. అని ఇలాంటి నక్షత్ర స్వరూప శ్రీమహావిష్ణు యాగం ఆచరిస్తే సర్వపాతకములు నశిస్తాయి. సప్త జన్మలలో జరిగిన పాతకములూ నశిస్తాయి. కుల సాంకర్యం వలన వచ్చింది కానీ, లేదా తల్లిదండ్రుల వలన వచ్చినదైనప్పటికీ కూడా దాన్ని ఉపశమింపచేస్తుంది. దీని వలన చక్కని రూపం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. ఉత్తమమైన శరీర ఆరోగ్యం కలుగుతుంది. అంతులేని మనస్సంతృప్తి కలుగుతుంది. చక్కని వాక్ మాధుర్యం కలుగుతుంది. కాంతి ఏర్పడుతుంది. ఉత్తమమైన జాతి ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైనది. ధన్యమైనది. శ్రేయోదాయకమైనది.

 

 

 

 

Monday, 23 March 2020

అన్న ప్రాశనము

అన్న ప్రాశనము

బాలకునకు 6, 8, 10, 12, సరిమాసములందును, బాలికకు 5, 7, 9, 1  బేసిమాసములందుసు  అన్న ప్రాశనము చేయవలెను.
ధువ, మృదు, లఘు, చర. నక్షత్రములు ప్రశస్తములు,
రిక్త ( 4, 9, 14 ) నంద ( 1, 6, 11 ) తిధులును, అష్టమి, అమావాస్య, ద్వాదశి, తిధులును, ఆన్న ప్రాశనమునకు పనికిరావు.
ఆది, శని, మంగళవారములందు అన్నప్రాశనము చేయగూడదు.
జన్మరాశి, జన్మలగ్నమునకు అష్టమలగ్నము లేక అష్టమ నవాంశ లగ్నము. మీన, మేష, వృశ్చిక లగ్నములు అన్న పాశనమునకు యోగ్యములుకాపు
లగ్నమునకు కేంద్ర త్రికోణ స్థానములందు శుభ గ్రహములును, తృతీయ. షష , లాభములందు పాపగ్రహములును, అన్నప్రాశనమునకు శుభపదములు, దశమశుద్ది వుండవలెను. అనగా దమస్థానమునందు గ్రహములుండకూడదు. షష్ఠాష్టమములో లగ్నంలో చంద్రుడు వుండకూడదు. సష్టమములందును లగ్నమునందును, చందుడుండరాదు. అనూరాధ, శతభిషము, పాతి, జన్మ నక్షత్రములు అన్నప్రాశనమునకు యోగ్యములుగా వని కొందరి అభిమతము
లగ్నమునకు 5. 9. 12. 1, 4, 7, 10, 8 స్థానములందు క్షీణచందుడున్న యెడల భిక్షాశియు, పూర్ణచందుడుండిన యజ్ఞకర్తయు, గురుడుండిన ధీర్ఘాయుష్యము గలవాడును, బుధుడుండిన జ్ఞానియు, కుజుడుండినయెడల పైత్యరోగియు, సూర్యుడుండిన కుష్టురోగియు, శనియుండిన క్లేశవంతుడును, వాతరోగియు. శుకుడున్నయెడల భోగవంతుడును అగుసు. నారద వచనానుసారము శుక్ల పక్షపూర్వాపము అన్నప్రాశనమునకు ప్రశస్తము
మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి అశ్వని , రోహిణి , మృగశిర , పునర్వసు , పుష్యమి , ఉత్తర , హస్త, చిత్త , స్వాతి , అనూరాధ , ఉత్తరాషాడం , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , ఉత్తాభాద్ర , రేవతి నక్షత్రములయందు చేయవలెను . ఆది , శని , మంగళవారములు నిషేధం . జన్మలగ్నం , అష్టమ లగ్నం కాకుండగను , దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను
నారదోక్త్యనుసారము జన్మనక్షతమునకు శుభసదమని  తెలియుచున్నది. అయితే జ్యోతిర్వివరణమందు  జన్మనక్షత్రమునందు ఆన్నపాశనము చేసినయెడల శ్రీక్షయమును. దశమ నక్షత్రమందు అతిసౌఖ్యమును, ఆధాననక్షత్రమునందు రోగ నాశనము గలుగునని చెప్పబడినది.
భరణి, కృత్తిక, ఆశ్రేష, మఖ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద, జ్యష్ఠ, మూల, నక్షత్రములు అన్న పాయనమునకు నింద్యములు, అనగా విడువవలెను

Wednesday, 22 January 2020

ఏల్నాటి శని

ఏల్నాటి  శని ప్రభావం - ఉపశమనం

ఓం శం శనయే నమః

జ్యోతిష్య శాస్త్ర రీత్య శనికి నవగ్రహలలోప్రత్యేక స్థానం వుంది.
శని అనగానే... ఏల్నాటి  శని (సాడే సాత్) మరియు, శని దశ.
శని పుట్టుక, ప్రవర్తన, ప్రభావము ముందుగా తెలుసుకుందాం. శని నపుంసక గ్రహం, వాయుతత్వ గ్రహం, నల్లని దేహం, మందబుద్ధి గలవాడు. పెద్ద దంతములు, వితారంగ బిరుసైన రోమములతో ఉండును. చాయాదేవి, సూర్యుల సంతానమే శని, సూర్యునకు పడమర వైపున దనుస్సు ఆకారపు మండలంలో నివసించును. కాస్యప గోత్రస్తుడు, సౌరాష్ట్ర దేశాదిపతి.
శనిని మందగమనుడని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రరిత్యా శని మకర మరియు కుంభ రాశులకు, పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాంలకు అధిపతి, మిధున, కన్య మరియు వృషభ రాశులు మిత్ర క్షేత్రములు కర్కాటక, సింహరాశులు శత్రు స్థానములు, శని మిత్ర గృహాలు, శుక్ర, రాహు మరియు బుద శత్రుగృహాలు, రవి, చంద్రులు, గురు సమానభావంతో ఉండును. గోచారరిత్యా జన్మరాశికి శని 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలు మంచివి గావని చెప్పుదురు. గాని ముఖ్యంగా జన్మరాశికి 12, 1, 2 స్థానాలలో శని సంచారం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు, విషమ పరిస్థితులుంటాయి. ఈ సమయాన్నే ఏల్నాటి  శని అందురు. ఏల్నాటి  శని 7సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. శని 12 రాశులు చుట్టి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శని ఒకోక్క రాశిలో 2 సం   6 నెలలు సంచరిస్తుంది. అలా చంద్రరాశికి ముందు (12వ స్థానం), జన్మరాశి తరువాతి స్థానం (2 స్థానం) లో శని సంచారానికి 7సం వ 6 నెలలు పడుతుంది.
 మన జీవితంలో ఎలాటి శని రెండు నుంచి మూడు మార్లు వస్తుంది.  మొదటి 2సం  6 నెలలు 12వ స్థానంలో ఉన్నప్పుడు చెడు ప్రభావం చూపును, అప్పుడప్పుడే మానసిక ఆందోళన ప్రారంభం అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నశించి ఇబ్బందులు ప్రారంభంఅవుతాయి. జన్మరాశి ( 1వ స్థానం ) లో ఉన్నప్పుడు ఆకారణకలహాలు, ఆస్థినష్టం, కుటుంబంలో మరణం, అనారోగం కలుగవచ్చు. 2వ స్థానం ( చివరి 2 సం   6 నెలలు ) నిరాశ నిస్పృహలు, అపవాదులు, కొన్ని సమయాలలో ఆత్మహత్యకు ప్రేరణవంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. మొదటి రెండున్నర సంవత్సరాలు  శిరస్సు  వని అని, మద్య రెండున్నర సంవత్సరములు  జన్మ  శని అని, చివరి రెండున్నర సంవత్సరములు పాద శని అంటారు
 బాల్యంలో ఏల్నాటి వస్తే’ మంగు శని’ అని యవ్వనంలో వస్తే ’ పొంగు శని  అని, వృద్ధాప్యంలో మారక శని అని వ్వవహరిస్తారు. ఇదియు గాక చంద్రరాశి నుండి 8వ స్థానంలోకి శని ప్రవేషించినచో అష్టమశని అని, నాలగవ స్థానంలోకి శని ప్రవేశిస్తే అర్ధాష్టమ శని అని అంటారు. శని 3, 6, 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు  మంచి జరుగుతుంది.
ఏల్నాటి  శని సమయంను ఏడు భాగాలుగా విభజించి ఫలితాలు పరిశీలించినట్లయితే...
మొదటి 3 నెలలు 10 రోజులు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు
ఆ తరువాత 13 నెలలు ఉద్యోగ లాభం.
ఆ తరువాత 1 సం   8నెలలు 10 రోజులు మానసిక ఆందోళన, అవమానం.
1 సం   4 నెలలు 20 రోజులు ఆర్థికంగా కోలుకోవచ్చు.
1 సం   1 నెల 10 రోజులు అనారోగ్యం, సమయానికి డబ్బు చేతికి రాకపోవచ్చు.
10 నెలలు సంతోషం.
చివరి 6 నెలలు 20 రోజులు ఆర్థిక సమస్యలతో పాటు ప్రమాదాలు జరిగే అవకశాలు ఎక్కువ.
జీవితంలో ప్రభావం చూపే అంశాల ముఖ్యంగా ఆయుష్యు, మరణం, సేవకులు, బందికాన, ప్రవాసం, నీచ విద్య, దుఖం, అధర్మం, అనాచారము, కార్యభంగము, వ్యసనం, అతి త్రాగడు, కళ్ళలో అనారోగ్య లక్షణాలు, కుటుంబ తగాదాలతో మానసికంగా కృంగిపోవడం.
అయితే జాతక రిత్యా ఎవరైతే పుష్యమి, అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించినవారు, శని మకర లేక కుంభ రాశులలో ఉన్నవారు మరియు మకరం లేక కుంభ లగాలలో జన్మించిన వారికి శని ప్రభావం అంతగ ఉండకపోవచ్చు.
ఇక్కడ మరోవిషయం చెప్పుకోవాలి జాతకం ప్రకారం శని మహాదశ నడుస్తున్న వారికి ( శని మహాదశ 19 సం   లు ) ఏల్నాటి  శని గూడ తోడైనట్లయితే, దీనికి తోడు శని మహాదశ, శని అంతర్థగా ఉండే ఏల్నాటి  శని వచ్చినట్లయితే వారి బాధలు వర్ణణాతీతం. అతిగా బాధలు పడవలసి రావచ్చును.
 ఏల్నాటి  శనికి శాంతి ప్రక్రియలు ముఖ్యంగా శనికి ప్రీతికరమైన పనులు చేయడం. సత్యమే పలుకడం, అబద్ధం ఆడకుండా ఉండటం, శనికిి ఇష్టం అయిన వస్తువులను దానం చేయడం లాంటివి చేయాలి.
దీనితో కొంత  ఉపశమనం కలిగించినా, మంత్ర పఠనం చేయాలి. ఇందుకు సరైన గురువును ఆశ్రయించాలి.
ప్రతిరోజు దిగువ ఉదహరించిన ప్రార్థన నిర్ణీత సంఖ్యలో పఠించాలి.

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్


 కాకులకు బెల్లంతో కలిపిన నల్ల నువ్వులు పెట్టగలరు మంచి స్వచ్చమైన నీలంను వెండితో చేయించి కుడి చేతి మధ్య వ్రేలికి ధరించి కేజింబావు నల్ల నువ్వులు దానం ఇయ్యాలి.
నవగ్రహాలలోని శని గ్రహమునకు నువ్వుల నూనెతో శని త్రయోదశమి రోజున లేక శనివారం రోజున తైలాభిషేకం చేయించాలి.
వీలు కాని వారు మాత్రం ప్రతిరోజు ప్రాతః కాల సమయంలో శని రహస్య స్తోత్రము పఠించాలి.

నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బద్రురూపాయ కృష్ణాచయ నమోస్తుతే
నమస్తే రౌద్ర దేహాయ నమస్తే శాంత కాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో
నమస్తే యమ సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమ దేవేశ దీపస్య పుణతస్యచ


ప్రతి శనివారం ఉదయం తల స్నానం చేసి నల్లని వస్త్రం ధరించి నెయ్యి, ఆముదం, నువ్వుల నూనెల మిశ్రమంతో గూడిన ఇనుప గరిటలో ఎఱువు నలుపు, తెలుపు కలిపి వత్తులు వేసి గదిలో పడమట దిక్కులో శని దీపం ఉంచినచో శని శాంతి జరిగి శని  వేదన ఉండదని ప్రతీతి.

Saturday, 28 December 2019

ధనుర్మాసం

  ఆండాళ్ ఆరాధన 


ధనుర్మాసం అంటే  ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం మన సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి.
ఆండాళ్ తల్లి ఆరాధన, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని అంటారు. ధనుర్మాసంలో  తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. కోరికలు ఈడేరడానికి  ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు.
ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో  తిరుప్పావై పారాయణం చేసిన వారికి ఆండాళ్ తల్లి అనుగ్రహం కలుగుతుందని విస్వాసం. వేదమనైతుక్కుంవిత్తాగుం  అంటారు తిరుప్పావై అంటే వేదమంతటికి మూల బీజము . ఈ తిరుప్పావైలోని ముపై పాశురాలు నాలుగు వేదాలలోని సారము. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. అమ్మకటాక్షం కలిగితేనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. భూదేవియే శ్రీ ఆండాళ్తల్లిగా అవతరించి తిరుప్పావై మన కందించింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. 
పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో గోదాదేవి స్వామిని కీర్తించేది.  మనలో ఎన్ని దోషాలున్నప్పటికి వాటిని తొలగించిపరమాత్మను చేరుకోవడానికి ధనుర్మాస అనుగ్రహిస్తున్నాడు.
అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయి. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాస వ్రతంతో ఆతల్లి మనందరిలో ప్రేమను నింపి ఆ ప్రేమ పాశముచేతభగవంతునిచే బంధించే ఉపాయాన్ని అనుగ్రహించింది.  మాసానాం మార్గశీర్షం  అని చెప్పుకున్న పుణ్యకాలము భగవత్ ప్రాప్తి కొరకు శరణాగతిని ఉద్బోదించే పరమ పవిత్రకాలము ఈ ధనుర్మాసము.

-
*యాజ్ఞికదర్శిని అంతర్జాల పత్రికలో ప్రచురించిన వ్యాసం*

Thursday, 19 December 2019

సూర్యగ్రహణం - షష్ఠగ్రహకూటమి ప్రభావం

 సూర్యగ్రహణం -  షష్ఠగ్రహకూటమి ప్రభావం

డిసెంబర్ 26, 2019, గురువారం రోజున మూలా నక్షత్రంలో ధనుస్సు రాశిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది.  ఆరుగ్రహాల కలయిక ధనుస్సు రాశిలో జరుగుతున్నప్పుడు గ్రహణం సంభవిచడం దుష్ప్రభావాలకు దారితీస్తోంది.  
 సూర్యగ్రహణం ప్రభావం మనపైన పడకుండా ఉండటానికి జాగత్త పడితే వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్లిన చందంగా ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా నిజాయితీగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణముతో సత్ ఫలితాలు సాధ్యం.

లోక కల్యాణమునకు 97,98 శ్లోకాలు పఠించాలి

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹
శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹
విద్వత్తమో వీతభయః పుణ్యః  శ్రవణ కీర్తనః ౹౹
  

సూర్యగ్రహణం - ఆయా రాశులపై  ప్రభావం

 మేష రాశి:-
 గ్రహణం 9వ స్థానంలో సంభవిస్తున్నది ఇది మిశ్రమ ఫలితాలకు దారితీస్తుంది. . తొమ్మిదో స్థానం భాగ్య స్థానంలో గ్రహణ స్థితి వలన ఈ రాశివారికి కొంత తార్కిక వాదన  ఖండించే మనస్తత్వం ఏర్పడటం జరిగే అవకాశం ఉంది. 
 వృషభ రాశి:-
గ్రహణం 8వ స్థానంలో సంభవిస్తున్నది. అష్టమ స్థానం అనుకోని సమస్యలకు అవమానాలకు అలాగే ఆర్థిక సమస్యలకు కారణమైనది. సంబంధం లేని విషయాల్లో జోక్యం తగదు. పెట్టుబడుల విషయంలో  జాగ్రత్త!
మిధున రాశి:-
 గ్రహణం 7వ  స్థానంలో సంభవిస్తున్నది. సప్తమ స్థానం వైవాహిక జీవితానికి వ్యాపారానికి సంబంధించినది. 
 వైవాహిక జీవితంలో,  వ్యాపార భాగస్వామ్యాల విషయంలో పట్టుదల తగదు. 
కర్కాటక రాశి:-
గ్రహణం 6వ  స్థానంలో సంభవిస్తుంది. 6వ  స్థానం అనుకూల స్థానం. వృత్తిలోఅనుకూల ఫలితాలు.  కోర్టు కేసులు,  వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
సింహ రాశి:-
 గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తున్నది. 5వస్థానాన్ని పంచమ స్థానం అంటారు.  బుద్ధికి, సంతానానికి, సృజనాత్మకతకు సంభందించిన విషయాలలో ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలే ఎక్కువ. ఫై విషయాలలో జాగ్రత్త అవసరం.  
కన్య రాశి:-
 గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది. 4వ స్థానం సుఖానికి వాహనాలకు స్థిరాస్తులకు సంబంధించినది. ఇక్కడ కూడా వ్యతిరేకఫలితాలు ఇచ్ఛే అవకాశాలు ఉన్నాయి.  ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. 
తులా రాశి:- 
గ్రహణం మూడవ స్థానంలో సంభవిస్తుంది. 3వ స్థానం అనుకూల స్థానం.   చేపట్టిన పనుల్లో విజయం సాధించే
అవకాశాలు ఉన్నాయి. 
వృశ్చిక రాశి:- 
 గ్రహణం 2వ స్థానంలో సంభవిస్తున్నది.2వ  స్థానం ధనానికి, కుటుంబానికి,  మాటకు సంభందించినది. జాగ్రత్త అవసరం. వాదప్రతివాదాలు తగదు
.ధనస్సు రాశి:- 
 గ్రహణం 1వ స్థానంలో సంభవిస్తున్నది.  ఇది అనుకూల  స్థానంకాదు.  తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి.
మకర రాశి:- 
 గ్రహణం 12వ స్థానంలో సంభవిస్తున్నది. 12వ  స్థానం ఖర్చులకు,  విదేశీ యానానికి,  ఆరోగ్య సమస్యలకు సంబంధించినది. తొందరపాటు తగదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. 
కుంభ రాశి:- 
గ్రహణం 11వ స్థానంలో సంభవిస్తున్నది. ఇది లాభ స్థానం. అనుకూల స్థానం.  అన్ని శుభఫలితాలే. 
మీన రాశి:-
గ్రహణం 10వ స్థానంలో సంభవిస్తున్నది. దశమ స్థానం వృత్తికి,  పేరు ప్రతిష్టలకు సంబంధించినది.  వ్యతిరేక ఫలితాలకు ఆస్కారం. 

షష్ఠగ్రహకూటమి

ధనస్సురాశిలో షష్ఠగ్రహకూటమి సంభవించనుంది. ఇదే సమయంలో గ్రహణ సంభవం యదృర్శిచికం .గ్రహణం సంభవిచే ప్రాంతాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా షష్ఠగ్రహకూటమి ప్రభావం ఉంటుంది.
ధనస్సురాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్న ఆరు గ్రహాలు గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు . 2019 డిసెంబర్ 25, 26, 27 తేదీలలో  షష్ఠగ్రహకూటమి సంభవించనుంది
2019 డిసెంబర్ 28 నుంచి 2020 జనవరి 1 వరకూ గురు, శని, కేతు, సూర్య,  బుధులు అయిదు గ్రహాలు కలసి ధనస్సురాశిలో ఉంటాయి. ఈ 15 రోజుల ఫలితాలు విశ్లేషిస్తే ఆలోచించే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. 
గ్రహకూటమి ప్రయాణాన్ని గమనిస్తే తరువాత రెండురోజులకు బుధుడు కూడా మకరానికి వెళ్లగా, మిగిలిన నాలుగు గ్రహాలు కలసి కొంతకాలం ధనూరాశిలో ఉంటాయి. 
ఇక్కడ గురు - శనుల పాత్ర ముఖ్యమైనది. ఇరవై ఏళ్ల కొకసారి ఒక రాశిలో గురు - శనులు కలుస్తారు.
గురు - శనులు కలిసిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  మార్పులు తధ్యం. గతంలో జరిగాయి. ఎందుకంటే గురు, శని గ్రహాల గమనంతోనే  జాతకంలో మార్పులు జరుగుతాయి.  ప్రస్తుతం వీరు కలుస్తున్న ధనస్సు రాశి తోపాటు, ధనస్సుకు ఎదురుగా ఉండే మిధునరాశికి కూడా సమాన ఫలితాలు ఉంటాయి. రాశులకు సంభంధించిన దేశాలలో కూడా మార్పులు, నష్టం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భారతదేశాన్ని సూచించే మకరరాశికి ద్వాదశరాశి ధనస్సు రాశి ద్వాదశ ఫలితం ఉంటుండి, అదేవిధంగా అమెరికాను సూచించే మిధునరాశి ధనస్సుకు ఎదురుగాఉండటాన్ని గమనించి జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో లగ్నసమయం గుర్తించే విధానము

ఫలానా సమయానికి ఏ లగ్నం ఉన్నదో తెలుసుకోవడం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా లగ్నం రాశిని ఎలా గుర్తించాలి? సాధారణంగా ఇది అందరికీ కలిగే సందేహమే. అమెరికాలో నేటి ఉదయం ఏలగ్నం. అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఆలోచన మొదలవుతుంది. దీనికి ప్రపంచ వ్యాప్తిముగా సూర్యుడే ప్రామాణికం అని గ్రహించాలి.
పన్నెండు రాశులు 12 లగ్నములు. అవి 1 ) మేషము 2 ) వృషభము 3 ) మిధునము 4 ) కర్కాటకం 5 ) సింహం 6 ) కన్య 7 ) తుల 8 ) వృశ్చికం 9 ) ధనస్సు 10 ) మకరం 11 ) కుంభం 12 ) మీనం
రోజుకు 24 గంటలు. అంటే 12 లగ్నములు ప్రతిరోజూ ఉంటాయి. ప్రతిలగ్నం సమయం రెండుగంటలు
 పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి.
ఉదాహరణ: ఒక రోజు  ఉదయం 06-05 నుండి 08-04 ని.ల వరకు  మకరలగ్నం ఉంది.
తరువాత ఏలగ్నం?
ఇంకేమిటి ఉంటుంది?
మకరం తరువాత కుంభమే  కదా! :- ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.
ఏ లగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.

సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు?
మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు? సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము.  అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.
నక్షత్రాలు - రాశులు
నక్షత్రాలు - రాశులు

      కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.  ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.  - అని పురాణ కథ 

ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది.



అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం
కృత్తికాత్త్రయం రోహిణి మృగశిరార్థం - వృషభం
మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుస్త్రయో - మిధునం
పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాన్తం - కర్కాటకం
మఖ పుబ్భా ఉత్తరాపాదం - సింహం
ఉత్తరస్త్రయో హస్త చిత్రార్థం - కన్య
చిత్రార్థం స్వాతి విశాఖత్త్రయో - తుల
విశాఖపాదో అనూరాధా జ్యేష్టాంతం - వృశ్చికం
మూల పూర్వాషాడ ఉత్తరాషాడ పాదో - ధనుః
ఉత్తరాషాడత్త్రయో శ్రవణం ధానిష్ఠార్థం - మకరం
ధనిష్ఠార్థం శతభిషం పూర్వాభాద్రత్త్రయో - కుంభం
పూర్వాభాద్రపాదో ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం

Tuesday, 10 December 2019

పంచకరహితము

పంచకరహితము అంటే...


శ్లో . తిథివారోడుభిర్యు క్తం తత్కా  లోదయమిశ్రితం
 నవసంఖ్యా హ రేద్భాగం శేషంపంచక మీరితమ్.

వివాహముహూర్తం తిథి వార నక్షత్రముల సంఖ్యను మొత్తము చేసి యప్పటి సంఖ్యను చేర్చి 9 చే భాగించవలెను . అట్లు భాగించగా మిగిలిన శేషము 3, 5, 7, 9 సంఖ్యలలో వొకటి వచ్చినా పంచకరహితమైనట్లు గ్రహించవలెను
ఉదా : - వివాహముహూర్తము చైతశుద్ధదశమినాడు అని అను కొందము . ఆనాడు తిధి నవమి . వారము బుధవారము . నక్షత్రము రోహిణి . లగ్నము కన్య  . తిథి నవమి  9 + వారము 4 + నక్షతము 4 + లగ్నము 6 + మొత్తము 23 ను 9 చే భాగించిన 5 వచ్చినది.  పంచకరహితమైనదిగా నిర్ణయింపవలెను .

పంచకరహితఫలములు

శ్లో . ఏకో మృత్యుర్ద్వయం వహ్నిశ్చత్వారో రాజపంచకం
షట్చోరో ఇష్ట రోగస్స్ల్యాది  త్యేత త్పంచకం స్మృతం

 శేషము వచ్చిన సంఖ్య దిగువ ఉదహరించిన విధముగ ఫలితములు ఉండును
 1 . మృత్యుపంచకము దీనియందు వివాహము చేసిన వధూ వరులకు మరణప్రాప్తియగును .
2 . వహ్ని పంచకము - దీనియందు వివాహ మొనర్చిన అగ్ని చే  ఆపదకలుగును .
4 . రాజ పంచకము - దీనియందు వివాహ చేసిన  రాజకీయసంబంధమైన చిక్కులు కలుగును .
6 . చోర పంచకము - దీనియందు వివాహము చేసిన సొత్తు దొంగలపాలు అగును.
8 . రోగ పంచకము - దీనియందు వివాహమొనరించిన వధూవరులు రోగయుక్తులై బాధలను అనుభవింతురు .

మరో ముఖ్య విషయం కొన్ని సందర్భాలలో కొన్ని పంచకములను వదలివేయవలెను
ఆదివారమునాడు రోగ పంచకమును, శనివారమునాడు మృత్యుపంచకమును, మంగళవారమునా అగ్ని పంచకమును, సోమ, గురువారములందు రాజపంచకమును బుధశుక్రవారములయందు చోరపంచకమును విడువవలయను .  రాత్రిముహూర్తమునందు చోరరోగపంచకములను , పగటి ముహూర్తమునందు రాజాన్ని పంచకములను , అర్ధరాత్రి  మృత్యుపంచకమును విడువవలెను.

Friday, 20 September 2019

గ్రహదోషనివారణకు సుందరకాండ పారాయణము

గ్రహదోషనివారణకు 
సుందరకాండ పారాయణము 

సోమస్య చే ద్దశా   దుష్టా తస్యా శాంత్యర్థ మాదరాత్ ,
 ‘తత స్స మధ్యంగత ' మి త్యముం సర్గం పఠే న్ని శి ,
శుక్లపక్షే ప్రదోషే చ తత శ్చంద్రం ప్రపూజయేత్ . 
చంద్రమహాదశ అనుకూలముగ లేకున్నచో ' తత స్స మధ్యం గత . . . ' ఇత్యాది శ్లోకముతో మొదలగు సుందరకాండ పంచమసర్గను శుక్లపక్షమున చీకటి పడుట తోడనే మొదలు పెట్టి ప్రతిదినము పారాయణ చేయవలెను . పిమ్మట చంద్రుని పూజింపవలెను ,

కుజదశా దోష నివారణకు 

గురో శ్చే ద్దోషదా భుక్తి ర్భౌమస్య తు దశాంతరే , 
ఉపదేశం హనుమతో రావణస్య తదా పఠేత్ . 
కుజమహాదశలో గుర్వంతర్దశ దోష ప్రద మగుచో హనుమంతుడు రావణునకు చేసిన యుపదేశము (51వ సర్గ) పారాయణ చేయనగును .

 శుక్రభుక్తి  ర్దోషదా చే ల్లోహితాంగ దశాంతరే , 
సీతాయాః ప్రార్థనం వహ్ని ముద్దిశ్య హనుమత్కృతే , 
యత్ర తం సర్గ మాధ్యాయ న్నాంజనేయం పఠేత్ క్రమాత్ 

కుజమహాదశలో శుక్రాంతర్దశ ప్రతికూలముగ నున్నచో , నపుడు సీతాదేవి హనుమంతుని కొఱకై యగ్ని ప్రార్థనము చేసిన ఘట్టము ( 58 వ సర్గ) ను ఆంజనేయుని ధ్యానించుచు పఠింపవలెను . 

రాహుదశా దోష నివారణకు 

కవే ర్భుక్తి రనర్థా చే తైసం త్సైం  హికేయ దశాంతరే , 
హనూమతా రాఘవాయ చూడామణ్యర్పణం ప ఠేత్ . 

రాహుమహాదశలో గుర్వంతర్దశ కష్టములు కలిగించుచున్నచో హనుమంతుడు రామునకు చూడామణిని సమర్పించు ఘట్టము ( 65వ సర్గ పారాయణ చేయవలెను . 

శనైశ్చరస్య భుక్త్యాం చే ద్దోషో  రాహుదశాంతరే , 
హనూమతాక్ష నాశాఖ్య సర్గ పారాయణం చరేత్ . 

రాహుమహాదశలో శన్యంతరము క్లేశ కరముగనున్న చో హనుమంతు . డక్షరాక్షసుని సంహరించుఘట్టము ( 47 వ సర్గ ) పారాయణ చేయవలెను .

గురుదశా దోషనివారణకు 

గురో ర్దశా చే దుగ్రా స్యా త్తథా సుందరకాండకే , 
పఠే త్సముద్రతరణసర్గ మేకం హనూమతః , 
అంతే చ సీతయా మిశ్రాన్ లా జాన్ హనుమతేర్పయేత్.  

గురుమహాదశ లో కష్టము లకు గురియగుచున్నచో హనుమంతు , సముద్రము దాటు ఘట్టము ( 1వ సర్గ ) పారాయణ చేయుచు , పారాయ ణాంతమున చక్కెర కలిపిన పేలాలను నివేదించవలెను . 

కేతు భుక్త్యాం  భవే త్పీడా గురో ర్యది దశాంతరే ,
 పఠే న్మధువనధ్వంస సర్గ ద్వయ మనుత్తమమ్ . 

గరుదశలో కేత్వంతరము పీడాకరమగుచో వానరులు మధువనము ధ్వంసము చేయు ఘట్టము ( 61 , 62 సర్గలు ) పారాయణ చేయవలెను .

 శనిదశా దోష నివారణకు 

శనేర్గశాయాం భుక్తి శ్చే చ్చనేరే వాహితా భవేత్ ,
 బ్రహ్మాస్త్ర బంధముక్త్యాఖ్యం పఠే త్సర్గం హనూమతః . 

శనిమహాదశ లో శన్యంతర్దశ కష్టములు కలిగించు చున్నచో  హను మంతుడు బ్రహ్మాస్త్రబంధము నుండి విముక్తి నొందిన ఘట్టము ( 46వసర్గ పారాయణ చేయవలెను . 

శనే ర్దశాయాం సౌమ్యస్య భుక్తి శ్చేత్ క్లేశ దాయినీ , లంకాదాహం హనుమతా కృతం సర్గం తదా పఠేత్ . 

శనిమహాదశలో బుధాంతరము క్లేశములు కలిగించుచున్నచో , హను మంతుడు లంకను తగులబెట్టు ఘట్టము ( 54 వసర్గ  ) పఠించవలెను .

శనే ర్ధకాయాం శుక్రస్య భు క్తి ర్యది విపత్ర్పదా,  
 చూడామణి ప్రదానాఖ్యం పఠే త్సర్గం హనూమతే . 

శనిమహాదశలో శుక్రాంతరమున బాధలు కలుగుచో హనుమంతు సీతాదేవి చూడామణి నిచ్చిన ఘట్టము ( 38వ సర్గ ) పఠించవలెను .

 బుధదశాదోష నివారణకు 

దశా బుధస్య దుష్టా చేత్ సీతాగ్రే హనుమత్కృతం , శ్రీరామవర్ణనం సర్గం పఠే. త్సంపూజ్య రాఘవమ్ , పఠనాంతే రాఘవస్య ముద్గాన్నం విని వేదయేత్ . 

బుధమహాదశ క్లేశకరముగ నున్న చో రాముని పూజించి సీతాదేవి యెదుట హనుమంతు డొనర్చిన రామవర్ణన ఘట్టము ( 35వ సర్గ పఠింప వలెను.) పారాయణానంతరము పొంగలి నివేదింపవలెను . 

బుధస్య చే ద్దశాయాం తు భౌమభుక్తిస్తు పీడయేత్ సీతాశుభ నిమిత్తాఖ్యం సర్గం షడ్వార మాపఠేత్ . 

బుధమహాదశలో కుజభుక్తి బాగుగాలేనిచో సీతాదేవికి కుభశకునము లగ పడుట అను ఘట్టము ( 27వ సర్గ ) ఆరుమారులు పారాయణ చేయవలెను 

కేతుభుక్తి  ర్దోషదా చే దుృధస్యాథ దశాంతరే
 హనూమతా శోక వనే  సీతాన్వేషణ మాపఠేత్ . 

బుధమహాదశలో కేతుభుక్తి  పీడాకరముగ నున్నచో , హనుమంతు డశోకవనమందు సీతాదేవిని వెదకుట యను ఘట్టము ( 14 వ సర్గ ) పఠించవలెను .


కేతుదశా దోషనివారణకు 

శుక్రభుక్త్యాం తు దోష శ్చే  త్కేతో రేవ దశాంతరే , హనూమదుక్తం రామాయ సీతాదర్శన మాపఠేత్ . 

కేతుమహాదశలో శుక్ర  భుక్తి బాధలు కలిగించుచో హనుమంత రామునకు చెప్పిన - సీతాసందర్శన ఘట్టము ( 65 వ సర్రసర్గ) పారాయణ చేయవలెను . 


శుక్రదశా దోష నివారణకు 

తత్ర్పెవ  శుక్రభుక్తి  శ్చేత్ ప్రాణినాం దోషకారిణీ , 
అంగుళీయ ప్రధానస్య సర్గం సుందరకాండజం , 
పతే తొషవణం భక్త్యా పూజయిత్వా మహీసుతామ్ . 

శుక్రమహాదశ యందలి శుక్రాంతరమున కష్టములు కలుగుచున్న చో సుందరకాండ మందలి హనుమంతుడు సీతాదేవికి అంగుళీయక ( ముద్రికా ) ప్రదానము చేసిన ఘట్టము ( 36వ సర్గ మూడు పూటలును స్నానము చేసి సీతాదేవిని ధ్యానించి పఠించవలెను . 

సా చే ద్భు క్తి రోషదా స్యాత్ స్త్రీణాం తత్త్రెవ  కాండ కే , 
సీతాయా ఆంజనేయేన సంవాదస్య తు సర్దకం , శృణుయు స్తా అర్థతశ్చ శబ్దతశ్చ ద్విజాననాత్ .

 స్త్రీలకు ఈ శుక్రమహాదశయందు శుక్రాంతరము దుష్టముగా నున్నచో వారు బ్రాహ్మణుని వలన సీతాదేవి ఆంజనేయునితో మాటలాడు ఘట్టము 33 వ సర్గ అర్థముతో గూడ వినవలయును .