Thursday, 28 September 2017
Tuesday, 26 September 2017
కట్టిన ఇల్లు కొంటున్నారా?
ఇల్లు కట్టి చూడు. అనేది
నిన్నటి మాట. మారుతున్నపరిస్థితుల్లో కట్టిన ఇంటిని కొంటున్న సందర్భాలే
ఎక్కువ. కట్టిన ఇంటిలో వాస్తు ఏమేరకు ఉందో ముందుగా తెలుసుకుని, ఇబ్బదులను
అధిగమించేందుకు నివారణోపాయాలు తెలుసుకుని ఆచరిస్తే తగు మేలుజరుగుతుంది.
ఇందుకోసం వీధిపోటు, ఇంటి ద్వారాలు వాటిదిశలు వాస్తు ప్రకారం ఉన్నాయా?,
అదేవిధంగా ఇంటిలో నడక, పడక గదుల తీరు తెన్నులను అద్యయనఁ చేయాలి.
ముఖ్యంగా దిగువ పది అంశాలను గమనించండి.
1. రోడ్డు దిశ
2. వీధిపోటు
3. ప్రధాన ద్వారం దిశ
4. పడకగది.
5. వంటగది.
6. ఇంటిలో నడక
7. పూజగది.
8. భోజనశాల .
9. ఇంటిలో పల్లం - నీటి వాటం
10. మరుగుదొడ్డి
వీటితోపాటు మరికొన్ని అంశాలను పరిశీలించాలి. కానీ తెలిసి తెలియక చేసేపనులవల్ల అనర్థాలు సంభవిస్తుంటాయి అని గమనించాలి
Thursday, 7 September 2017
వాస్తు ప్రభావము వల్ల జాతకాలు కలిసి వస్తాయా?
వాస్తు ప్రభావము వల్ల జాతకాలు కలిసి వస్తాయా? వీధిపోట్లు, ప్రధానగుమ్మం ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది. ఇంటీలో ఉండే గదులు, నడక ఎంతవరకు కలసి వస్తాయి, ఇలాంటి సందేహాలు కలుగడం సహజం.
కట్టిన
ఇల్లు తీసుకున్నా, స్థలం కొని ఇల్లు కట్టుకున్నా సాంకేతిక సమస్యలు
తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో నివారణోపాయాలు వెదుక్కోవడఁ తప్పనిసరి. ఇందుకోసం
ముందుగా ఇంటి దిశలు అంటే దిక్కులు, వాటి అధిష్టాన దేవతల పనితీరు
అధ్యయనఁ చేయాలి.
ఈశాన్యం - ఈశ్వరుడు,తూర్పు - ఇంద్రుడు ,
ఆగ్నేయము - అగ్ని,
దక్షిణము - యముడు
పంచభూతాలంటే ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు వీటికి ప్రాధాన్యతను ఇస్తూ ఇంటి నిర్మాణము, మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)